Viral Video: సరదాగా చేపలు పట్టేందుకు వచ్చాడు.. తీరా నీటిలో కనిపించింది చూడగా
సరదాగా చేపలు పట్టేందుకు స్థానికంగా ఉండే చెరువుకు వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చేపలు పట్టేందుకు గాలం వేయగా.. నీటి అడుగున కనిపించిన ఓ ఆకారం చూసి దెబ్బకు దడుసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ వీడియో చూసేయండి.

మన దగ్గరైతే తక్కువ గానీ.. విదేశాల్లో అయితే ఫిషింగ్ సర్వసాధారణం.. ఓ లాంగ్ వీకెండ్ వస్తే చాలు.. చాలామంది వ్యక్తులు తమ ఇంటి నుంచి దగ్గరలోని చెరువులో ఫిషింగ్‌కి వెళ్తుంటారు. చిన్న సైజ్ ట్రక్కులో బోటు వేసుకుని సరదాగా చేపల పడుతుంటారు. ఈ వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. ఓ వీకెండ్ రోజున ఇంటి పక్కనే ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లాడు. తీరా నీటిలోకి వల వేయగానే.. బోలెడన్ని చేపలు చిక్కుతాయని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే.! ఆ తర్వాత సీన్ ఇది..
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తనకు స్థానికంగా ఉన్న చెరువులోకి ఫిషింగ్‌కి వెళ్లాడు. తన వెంట తీసుకొచ్చిన గాలాన్ని నీటిలో వేసి.. కాసేపు ఎదురు చూశాడు. ఈరోజు బోలెడన్ని చేపలు చిక్కుతాయ్. ఎంచక్కా లొట్టలేసుకుంటూ చేపల కూర తిందామనుకున్నాడు. తీరా నీటిలో గాలం వేసిన కాసేపటికి.. నీళ్ల అడుగున కనిపించిన ఆకారాన్ని చూసి దెబ్బకు దడుసుకున్నాడు. చేప లాంటి ఆకారం.. కానీ చేప కంటే పొడవుగా ఉండటాన్ని చూసి భయపడ్డాడు. ఇంతకీ అతడికి కనిపించింది మరేది కాదు.. ముస్కేల్లుంగే.. చేపలలో ఇదో రకమైన జాతి. ఇవి చూడటానికి పొడవుగా.. భారీ కాయంతో ఉంటాయి. సుమారు 6.8 కేజీల నుంచి 16 కేజీల బరువు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఫ్లోరిడా, నార్త్ అమెరికా, కెనడాలోని చెరువులు, సరస్సులు, సముద్రాలలో కనిపిస్తాయి. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram



