Telangana: పైకి చూసి మిర్చి పంట ఏపుగా పెరిగిందనుకునేరు.. లోపలికి వెళ్లి చూడగా
పంట ఏపుగా పెరిగిందని అనుకుంటే పొరబడినట్టే.. ఆ పంట లోపల యవ్వారం కానిస్తున్నారు కొందరు. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పోచంపల్లి చిన్న గొదుమలై గ్రామంలో పంట చేనులో 16 గంజాయి మొక్కలను సాగు చేస్తూ ఇద్దరు రైతులు పోలీసులకు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. 16 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇద్దరు రైతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు పోలీస్ అధికారులు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి మొక్కలు పెంచినా.. విక్రయించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ ASP అన్నారు.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

