ఈ డైట్ ఫాలో అయితే.. మీ కిడ్నీలకు ఢోకా ఉండదు
మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి సరిగా పనిచేయకపోతే.. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. కాబట్టి కిడ్నీలను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని సహజ పద్ధతిలో కాపాడుకోడానికి నిపుణులు కొన్ని ఆహారాలు సూచిస్తున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బ్లూబెర్రీలు.. ఈ చిన్న నీలి పండ్లు శరీరంలోని సెల్ డ్యామేజ్ తగ్గించడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కిడ్నీలపై వచ్చే ఒత్తిడిని తగ్గించి వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కిడ్నీల్లో వాపు తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే క్యాబేజీలో విటమిన్ C, ఫైబర్, ఇతర శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలున్నవారు దీనిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో దోహదపడుతుంది. ఎగ్ వైట్ లో అధిక మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. అయితే ఇది ఫాస్ఫరస్ తక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి కిడ్నీ వ్యాధితో బాధపడేవారు దీన్ని నిశ్చింతగా తీసుకోవచ్చు. ఇది కండరాలు క్రమంగా క్షీణించే ప్రక్రియను తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే యాపిల్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీ సమస్యలను దూరం చేస్తాయి. కొవ్వు చేపలు..సాల్మాన్, ట్యూనా, మాకరెల్ వంటి చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. ఎర్రని ద్రాక్షల్లో ఉండే రెస్వెరాట్రోల్ అనే పదార్థం కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది రక్తంలో నెమ్మదిగా సర్క్యులేషన్ జరిగేలా చేస్తుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

