ఈ జ్యూస్ రోజుకి ఒక్క గ్లాస్ తాగండి.. ఫలితం మీరే చూడండి
అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకు అసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. మనం తీసుకునే ఆహారంపైన కాస్త నియంత్రణ ఉంటే చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ప్రకృతి సహజంగా లభించే కూరగాయలు, పండ్లు, వాటి జ్యూస్‌లు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పండ్లు, కూరగాయలతో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. ఇవి మనల్ని ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో అతి ముఖ్యమైనది ఏబీసీ జ్యూస్. ఈ జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. ఏబీసీ జ్యూస్ అంటే.. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి.. కాగా వంద మిల్లీలీటర్ల ఏబీసీ జ్యూస్ తీసుకోవటం వల్ల 45 నుంచి 50 కేలరీలు, 10 నుంచి 12 గ్రాముల కార్బోహైడ్రేట్లు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏబీసీ జ్యూస్‌లో 8 నుంచి 9 గ్రాముల వరకు షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే.. హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి. వృద్ధాప్యం వల్ల ముఖంపై వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

