రాణి చీమల అక్రమ రవాణా.. మార్కెట్ లో వాటి విలువ తెలిస్తే షాక్
ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ముల అక్రమ రవాణా గురించి వినే ఉంటారు, అయితే ఇప్పుడు వేటగాళ్ళు మన పర్యావరణానికి విలువైన చిన్న చీమలను కూడా అక్రమ రవాణా చేయడం ప్రారంభించారు. ఆఫ్రికాలోని కెన్యాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేస్తున్న 5,440 జెయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ క్వీన్ యాంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చీమలను అక్రమ రవాణా చేయడం ఏంటి? ఈ చీమలతో వారేం చేస్తారు? కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ ఈ కేసును ఒక చారిత్రాత్మక కేసుగా పేర్కొంది. స్మగ్లర్లు అక్రమ రవాణా చేసిన భారీ ఆఫ్రికన్ హార్వెస్టర్ ఒక్కో చీమ ధర 170 పౌండ్లు అంటే మన కరెన్సీలో 18 వేల రూపాయలు. ఈ జీవులు దాదాపు 2 నెలల వరకు జీవించి ఉండేలా ప్రత్యేక పద్ధతిలో వాటిని ప్యాక్ చేసారు. అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన వారిలో ఇద్దరు బెల్జియం, ఒకరు వియత్నాం, మరొకరు కెన్యాకు చెందినవారున్నారు. ఒక గూఢచార ఆపరేషన్ సందర్భంగా వారిని అరెస్టు చేశారు. ఈ కీటకాలను ఐరోపా, ఆసియాలోని విదేశీ పెంపుడు జంతువుల మార్కెట్‌లో విక్రయించడమే వారి లక్ష్యమని భావిస్తున్నారు. అరుదైన కీటకాల జాతులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ తెలిపింది. వాటిని పెంచేవారు వాటిని ప్రత్యేక ఆవాసాలలో ఉంచుతారు. వాటిని ఫార్మికేరియం అంటారు. ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమ అతిపెద్ద చీమ, ఇది దాదాపు 20 మిమీ వరకు, అదే రాణి చీమ అయితే 25 మిమీ వరకు పెరుగుతుంది. వాటి సైజ్ ఆకర్షణీయంగా అనిపించడంతో వాటిని పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెజాన్ అడవుల్లో భారీ అనకొండ హల్‌చల్
కూల్‌డ్రింక్స్ ఇష్టంగా తాగేస్తున్నారా.. జాగ్రత్త
ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు.. ట్రై చేయండి!!
2 నెలల గ్యాప్‌లో 2 లగ్జరీ కార్లు..! దాదాపు రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన సోనియా
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

