హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఉప్పీ కొడుకు..
సెలబ్రిటీల పిల్లలు సినిమా పరిశ్రమలోకి రావడం కామన్. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొడుకు కూడా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవల ఆయుష్ పుట్టిన రోజున కుటుంబం మొత్తం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంది. అక్కడే ఆయుష్ మొదటి సినిమా స్క్రిప్ట్ కు పూజలు కూడా నిర్వహించారని శాండిల్ వుడ్ న్యూస్.
ఉపేంద్రకు కన్నడలోనే కాదు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. మొదట దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఉప్పి..ఆ తర్వాత హీరోగా స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఇక ఉపేంద్ర భార్య, ఆయుష్ తల్లి ప్రియాంక ఉపేంద్ర కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇటీవల ఆమె నటించిన ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు తన కొడుకు వంతు వచ్చిందని భావించారో ఏమో కానీ.. ఉప్పి ఉన్నపళంగా తన కొడుకు ఆయుష్‌ను సినిమాల్లోకి తీసుకొచ్చేస్తున్నారట. అంతేకాదు కన్నడ సూపర్ స్టార్ యష్ తో సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన ఓ దర్శకుడు ఇప్పుడు ఆయుష్ ను లాంఛ్ చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు పురుషోత్తం. గతంలో యష్, భామ కలిసి నటించిన ‘మొదలా సాలా’ చిత్రానికి పురుషోత్తం దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయనే ఆయుష్ మొదటి సినిమాను తెరకెక్కించనున్నారని టాక్. ఇక ఈ వార్త విన్న ఉప్పీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజా కాళ్ల మీద పడి ఏడ్చిన జబర్దస్త్ కమెడియన్
నా జీవితంలో ధోనీ.. ఒక మాయని మచ్చ! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

