2 నెలల గ్యాప్‌లో 2 లగ్జరీ కార్లు..! దాదాపు రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన సోనియా
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది సోనియా సింగ్. అందులో అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈ అమ్మడి అభినయం అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన సోనియా సింగ్ పలు షార్ట్ ఫిల్మ్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలాగే ఢీ వంటి టీవీ ప్రోగ్రామ్స్, షోస్ లోనూ సందడి చేస్తోందీ అందాల తార. మొత్తానికి సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ తో బాగానే సంపాదిస్తున్నట్లుంది సోనియా సింగ్. ఈ క్రమంలోనే తాజాగా రెండు నెలల గ్యాప లోనే మరో ఖరీదైన కొత్త కారును కొనుగోలు చేసిందీ ఈమె. ఇందుకు సంబంధించిన విశేషాలను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ వీడియోతో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక కొత్త కారు కొన్న సోనియా హైదరాబాద్ లో ఓ టెంపుల్ దగ్గర పూజలు చేయించింది. దేవుడి ప్లాన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటుంది. ప్రయాణం కష్టంగా ఉన్నా దేవుడ్ని మర్చిపోవద్దు. మన కోసం ఏదైనా గొప్పగా చేస్తున్నాడు అని ఎదురుచూడాలి అంటూ తన ఫొటోలు, వీడియోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం సోనియా సింగ్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోనియా కొన్న కార్ బెంజ్ ఫోర్ మ్యాటిక్ అని తెలుస్తుంది. మార్కెట్లో దీని ధర దాదాపు 1.39 కోట్ల నుంచి 1.50 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. ఈ రేటు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయం పక్కకు పెడితే.. సుమారు రెండు నెలల క్రితం అంటే మార్చి లోనే సోనియా మెర్సిడెజ్ బెంజ్ సీ క్లాస్ కారుని కొనుగోలు చేసింది. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్దూను కూడా తీసుకొచ్చింది. ఆ కారు ధర రూ.60-80 లక్షలకు పైగానే ఉంది. మొత్తానికి సోనియా రేంజ్ మారిపోయిందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఉప్పీ కొడుకు..
రోజా కాళ్ల మీద పడి ఏడ్చిన జబర్దస్త్ కమెడియన్
నా జీవితంలో ధోనీ.. ఒక మాయని మచ్చ! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
