నా జీవితంలో ధోనీ.. ఒక మాయని మచ్చ! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందాలంటే పెట్టి పుట్టాలి. ట్యాలెంట్ ఉంటే చాలదు.. టైం కూడా కలిసి రావాలి. అదే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే మాత్రం.. ఒక్క ఎఫైర్ న్యూస్ చాలు. అందులో ఓ క్రికెటర్‌తో ఎఫైర్ అనే న్యూస్ వినిపిస్తే చాలు.. ఏ బ్యూటీకైనా ఎక్కడలేని క్రేజ్ అండ్ గుర్తింపు వచ్చేస్తుంది.
అలా తన సినిమాల కంటే.. స్టార్ క్రికెటర్ ధోనీతో రిలేషన్‌లో ఉందనే న్యూస్‌తోనే పాపులర్ అయిన రాయ్ లక్ష్మీ. ఇప్పుడు ఉన్నట్టుండి షాకింగ్ కామెంట్స్ చేసింది. ధోనీతో ఎఫైర్ తన జీవితానికే మాయని మచ్చ అంటూ అసహనం వ్యక్తం చేసింది. తన కామెంట్స్‌తో … చాలా రోజుల తర్వాత ఇప్పుడు నెట్టింట మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. కన్నడ బ్యూటీ అయిన రాయ్ లక్ష్మీ.. సినిమాల్లో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంది. తమిళ్ సినిమాతో ఫిల్మ్ పెటర్నిటీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ స్టార్ ఇమేజ్ మాత్రం అందని ద్రాక్షలాగే మారింది. ఈ క్రమంలోనే అప్పట్లో రాయ్ లక్ష్మీ ధోనీతో కాస్త సన్నిమితంగా ఉన్న ఫోటోలు బయటికి రావడంతో సెన్సేషన్ అయింది. ఈ బ్యూటీకి క్రేజ్‌తో పాటు ధోనీ గర్ల్ ఫ్రెండ్ అనే కొత్త గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. అప్పట్లో అలా హల్చల్ చేసిన వీరిద్దరి రిలేషన్ షిప్ న్యూస్.. ఆ తర్వాత కనుమరుగైపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

