ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు.. ట్రై చేయండి!!
మీకు షుగర్ ఉందా? రైస్ తినడం మానేశారా? కానీ మీరు రైస్ తినాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే పద్ధతులు పాటించండి. భోజనం అంటే మనకు అన్నం తినడమే. దేశంలో ఎక్కడ చూసినా వారి రోజువారీ ఆహారంలో ఇది ఒక భాగం. కానీ పంచదార తర్వాత అంత డేంజర్ సిగ్నల్ ఇచ్చే అన్నాన్ని కూడా జాగ్రత్తగా తినాలి.
ఎందుకంటే వాడే బియ్యం రకాన్ని బట్టి దీన్ని ముప్పులో హెచ్చు తగ్గులు ఉంటాయి. మూడు పూటలా అన్నం తినేవారికి ఇది కాస్త కష్టంగా ఉండే మాటే అనుకోండి. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కాకుండా మీరు ఇతర రకాల బియ్యం తీసుకోవచ్చు. విశేషం ఏంటంటే ఈ అన్నాన్ని రోజూ తినవచ్చు. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగకుండా అదుపులో ఉంటుంది. ఈ అన్నం ఏంటి? దాన్ని ఎలా తయారు చేయాలో మీకు నేను చెప్తాను. సామలు రైస్ తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ ఉన్నవారు ప్రతిరోజు వైట్ రైస్ ని ఎక్కువ మొత్తంలో తినకూడదు. దీనికి బదులుగా కొన్నిసార్లు బ్రౌన్ రైస్, కొన్నిసార్లు సామలు రైస్ తింటే మంచిది. మీకు సామలు అంటే తెలుసా? అదేనండి మిల్లెట్స్ లో ఒక రకమైన రైస్. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత రైస్ చేసుకొని తినాలి. ఇలా తినడం వల్ల గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది 50% వరకు తగ్గుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అనేవి అంత ఈజీగా పెరగవు. సామలు మిల్లెట్స్ లో ఒక భాగం. రోజూ మీరు ఈ రకమైన రైస్ తినవచ్చు. ఎందుకంటే సామలు గ్లైసోమిక్ ఇండెక్స్ 50 కంటే తక్కువ. అంటే అవి చాలా వేగంగా గ్లూకోస్ స్థాయిని పెంచవు. దీని కారణంగా రక్తంలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల అవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా పనిచేస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2 నెలల గ్యాప్‌లో 2 లగ్జరీ కార్లు..! దాదాపు రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన సోనియా
హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఉప్పీ కొడుకు..
రోజా కాళ్ల మీద పడి ఏడ్చిన జబర్దస్త్ కమెడియన్
నా జీవితంలో ధోనీ.. ఒక మాయని మచ్చ! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

