అమెజాన్ అడవుల్లో భారీ అనకొండ హల్‌చల్
అనకొండ.. ఈ పేరు వింటేనే ఒల్లు జలదరిస్తుంది. ఇప్పటి వరకు భూమిపై కనిపించిన పాముల్లో కెల్లా అతి పెద్ద పాము ఇదేనని చెబుతారు. మనుషులను కరవడం కాదు.. ఏకంగా ఒక్క గుట్కతో మింగేస్తుంది. అనకొండ విశ్వరూపాన్ని చూపిస్తూ చాలా హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చేశాయి. అలాంటి అనకొండ నిజంగానే మన కళ్లముందు కనపడితే ఎలా ఉంటుంది? ఎలా ఉండటమేంటి పై ప్రాణాలు పైనే పోవడం మాత్రం ఖాయం.
ఈ భూమి మీద అతిపెద్ద అనకొండగా భావించే ఓ భారీ పామును ఇటీవల ఈక్వెడార్‌లో కనిపించింది. తాజాగా అమెజాన్ అడవుల్లోనూ మరో భారీ అనకొండను గుర్తించారు. అమెజాన్ అడవులు చాలా దట్టంగా ఉంటాయి. అమెజాన్ అడవి మధ్య నుంచి పారుతున్న నదిలో ఓ భారీ అనకొండ ఈదుకుంటూ వెళ్లే వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను హెలీకాఫ్టర్ నుంచి చిత్రీకరించినట్లు స్పష్లమవుతోంది. నదిలో అనకొండ ఈదుకుంటూ వెళుతున్న దృశ్యం నెటిజన్స్‌ను ఆకటుకుంటోంది. ఎంతో దూరం నుంచే చూస్తేనే ఆ అనకొండ నదిలో ఎంతో పెద్దగా కనిపిస్తోంది. ఇక దగ్గరి నుంచి చూస్తూ ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో మరి. అంత భారీ అనకొండ నీటిలో మాత్రం వేగంగా ఈదుతూ ఉంది. దాని భారీ ఆకారాన్ని దగ్గరి నుంచి చూస్తే గుండె ఆగాల్సిందే. ఇక వీడియోను చూసిన నెటిజన్స్ రకరాలుగా కామెంట్స్ పెడుతున్నారు. హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉందని పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూల్‌డ్రింక్స్ ఇష్టంగా తాగేస్తున్నారా.. జాగ్రత్త
ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు.. ట్రై చేయండి!!
2 నెలల గ్యాప్‌లో 2 లగ్జరీ కార్లు..! దాదాపు రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన సోనియా
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

