AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తీర్థ యాత్రలో విషాదం.. కాశీ, అయోధ్య టూర్‌ వెళ్లిన చిత్తూరు జిల్లా వాసులకు అవస్థత..

పుణ్యం కోసం వెళితే పాపం ఎదురైనట్టు అయింది చిత్తూరు జిల్లాకి చెందిన టూరిస్టులు పరిస్థితి. ఈనెల 8న చిత్తూరు జిల్లా, పెద్ద పంజాని మండలం, గోను మాకులపల్లి గ్రామం దాని చుట్టుపక్కల రెండు గ్రామాలకు చెందిన 46మంది భక్తులు ఓ ప్రైవేటు బస్ బుక్ చేసుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు. ఏపీ,ఒరిస్సాతో పాటు ఉత్తర భారతదేశంలోని కాశీ, అయోధ్య

Andhra Pradesh: తీర్థ యాత్రలో విషాదం.. కాశీ, అయోధ్య టూర్‌ వెళ్లిన చిత్తూరు జిల్లా వాసులకు అవస్థత..
old lady died of heatwave
S Srinivasa Rao
| Edited By: |

Updated on: May 16, 2025 | 8:44 PM

Share

ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తీవ్ర ఎండ వేడిమికి తోడు వడగాల్పులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుండే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి 12 గంటలు అయినా వాతావరణం చల్లబడటం లేదు. దీంతో ప్రజలు ఇంటి నుండి అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు.అయితే సమ్మర్ హాలిడేస్ కలిసి రావడంతో కొందరు తీర్థ యాత్రలని, విహార యాత్రలని టూర్ లు వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎండలతో అవస్తలు పడుతున్నారు.

పుణ్యం కోసం వెళితే పాపం ఎదురైనట్టు అయింది చిత్తూరు జిల్లాకి చెందిన టూరిస్టులు పరిస్థితి. ఈనెల 8న చిత్తూరు జిల్లా, పెద్ద పంజాని మండలం, గోను మాకులపల్లి గ్రామం దాని చుట్టుపక్కల రెండు గ్రామాలకు చెందిన 46మంది భక్తులు ఓ ప్రైవేటు బస్ బుక్ చేసుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు.ఏపీ,ఒరిస్సాతో పాటు ఉత్తర భారతదేశంలోని కాశీ, అయోధ్యతో పాటు పలు పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు. వెళుతూ వెళుతూనే అన్నవరం,సింహాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకొని చివరగా కాశి,అయేద్య దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే అంతా సాఫీగా యాత్ర కొనసాగుతోంది అనగా ఒక్కసారిగా ఎండదెబ్బకు కుదేలయ్యారు. తీవ్ర ఎండలు వేరు వేరు చోట్ల తాగేనీరు మారడంతో పాటు తినే ఆహారం కలుషితం కావడంతో ఒక వృద్ధురాలు మృత్యువాత పడింది.

టూరిస్టు బస్సులో ఉన్న మరో 30మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఒడిశా సరిహద్దు దాటి ఆంధ్రాలోకి అడుగుపెట్టిన వెంటనే అంబులెన్సుకు సమాచారం ఇచ్చి గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. సుమారు వారం రోజులు కాశీ, అయోధ్య ఇతర పుణ్యక్షేతాలు దర్శనం చేసుకున్నారు. అక్కడక్కడే వారే స్వయంగా వంటలు వండుకొని తిని, తిరుగు ప్రయాణం అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఒరిస్సాలోని కటక్ దగ్గరలో గురువారం రాత్రి వంట చేసుకొని తిన్నారు. రాత్రి బస్సులో ఇచ్చాపురం సమీపానికి వస్తుండగా కొంతమందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వారు ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వారిలో పిచ్చుగల్లు.మునిలక్ష్మమ్మ (69) అనే వృద్ధురాలు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన మిగిలినవారు హాస్పిటల్ లో ఇంకా చికిత్స పొందుతున్నారు. మృతురాలి చెల్లెలు తోటి గంగులమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై హెడ్ కానిస్టేబుల్ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్రమైన ఎండలు, ఆహారం తేడా చేయడంతో ఆనారోగ్యానికి గురైవుంటారని వైద్యులు ప్రాథమికంగా తేల్చి చెప్పారు.  చిత్తూరులో ఉన్న యాత్రికుల కుటుంబీకులకు ఇచ్చాపురం పోలిసులు సమాచారం అందించారు.  ఎండల నేపథ్యంలో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవద్దని పోలిసులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..