ఆ మాట వెనక్కి తీసుకున్న టీటీడీ.. ఖుషీ ఖుషీగా.. భక్తులు
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 14 నుంచి వీఐపీ సిఫారసు లేఖల స్వీకరించేందుకు పచ్చ జెండా ఊపింది. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల స్వీకరించాలని నిర్ణయించింది. వేసవిలో తిరుమల కొండపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుందని భావించిన టీటీడీ.. గత నెల 1 నుంచి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించింది. సర్వదర్శనం సమయాన్ని పెంచడంతోపాటు సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం కల్పించాలన్న ఆలోచనతో సిఫారసు లేఖలను రద్దు చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే టీటీడీ విఐపి బ్రేక్ దర్శనాల సమయాన్ని కూడా మార్చింది. మే నెల 1 నుంచి జూలై 15 వరకు అంటే దాదాపు రెండున్నర నెలల పాటు పరిశీలనా త్మకంగా అమలు చేయాలనుకుంది. విఐపిలను కట్టడి చేసి ఎక్కువ సమయం సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు సిఫారసు లేఖలపై తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ వెనక్కి తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను మళ్లి పునరుద్దరిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాకు ఇంటరెస్ట్ లేదు.. లేడీ అఘోరీ నన్ను బలవంతం చేసింది
బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. ఇక ప్రశాంతంగా అక్కడ కూడా కూర్చోలేమా !!
హనీ ట్రాప్‌లో పాక్ హైకమిషనర్… అశ్లీల వీడియోలు లీక్

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
