బాంబులా పేలిన టాయిలెట్ సీట్.. ఇక ప్రశాంతంగా అక్కడ కూడా కూర్చోలేమా !!
ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేది మనం టాయిలెట్‌లోనే. ప్రశాంతంగా కూర్చొని పనికానిస్తే ఆ రోజంతా హుషారుగా ఉంటాం. కానీ అక్కడ కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ఎవరనుకుంటారు. కానీ అదే జరిగింది. ఓ ఇంట్లోని కమోడ్ పేలిపోయింది. ఫ్లష్ బటన్ నొక్కగానే టాయిలెట్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. వెంటనే మంటలు కూడా చెలరేగాయి.
ఈ ఘటనలో ఆ ఇంటి యువకుడికి కాలికి గాయాలయ్యాయి. నోయిడా ఇంట్లో అసలేం జరిగిందో చూద్దాం. నోయిడాలోని ఇంటి వాష్‌రూమ్‌లో వెస్టర్న్ కమోడ్ పేలింది. ఆ ఇంటి యువకుడు అషు నగర్ ఫ్లష్ బటన్ నొక్కగానే టాయిలెట్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. వెంటనే మంటలు చెలరేగాయి పేలుడుతో అషుకు ముఖం మీద, వంటిమీద కాలిన గాయాలయ్యాయి. వెంటనే గ్రేటర్ నొయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. అక్కడ వైద్యులు అతనికి 35 శాతం కాలిన గాయాలైనట్టు నిర్ధారించారు. పేలుడు చోటు చేసుకున్న సమయంలో అషు కనీసం మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ వాడలేదట. వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా.. ఇటువంటి ఘటన ఎక్కడైనా జరగవచ్చని, ప్రత్యేకించి పాత ఇళ్లలో, మెయింటనెన్స్ సరిగా లేని ప్లంబింగ్ వ్యవస్థ ఉన్న ఇళ్లలోని టాయ్‌లెట్లలో ఇటువంటి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హనీ ట్రాప్‌లో పాక్ హైకమిషనర్… అశ్లీల వీడియోలు లీక్
చెరువులో ఈతకు దిగి ఐదుగురు మృతి
బరువు తగ్గాలనుకునే వారికి బఠానీలు బెస్ట్ చాయిస్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

