పచ్చి మామిడికి ఫుల్ డిమాండ్.. కారణం అదేనా ??
మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. వేసవి వస్తుందంటే తియ్య తియ్యని మామిడి పండ్లే గుర్తుకు వస్తాయి. చెట్టుకు పూత వచ్చినప్పటినుంచి మామిడి చెట్లపైన ఉంటుంది దృశ్యంతా. వేసవి సెలవులకు గ్రామాలకు వెళ్ళిన విద్యార్థులు మామిడి తోటల్లో ఆడుకుంటూ పచ్చి మామిడికాయలు కోసుకొని ఉప్పు, కారం వేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తారు.
పచ్చి మామిడిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి వ్యాధుల నుండి రక్షణ ఇచ్చే శక్తిని పెంపొందించేందుకు సహాయపడుతుంది. వాతావరణ మార్పులతో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ అంటు వ్యాధులు వంటి సమస్యల నుండి అడ్డుకునే శక్తిని ఇస్తుంది. వేసవి వేడి తీవ్రంగా ఉండే సమయాల్లో శరీరం వేడి పెరిగే అవకాశం ఉంది. అప్పుడు పచ్చి మామిడిని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇందులో ఉండే సహజ ఎలక్ట్రోలైట్లు వీటి స్థాయిని సమతుల్యంలో ఉంచుతాయి. అధికంగా వాపు, తలనొప్పి ఎలాంటి వేడి కారణంగా వచ్చే సమస్యలను కూడా ఇది తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి మామిడిలో ఫైబర్, పెక్టిన్ లాంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగవడానికి సహాయపడతాయి. ఆమ్లత్వం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే మామిడికాయను ఉప్పు, కారం కలిపి తినడం వల్ల మంచిది. ఇది పేగుల పనితీరును మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పచ్చి మామిడిలో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హృదయం సక్రమంగా పనిచేయడానికి పొటాషియం అవసరం. ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతూ గుండెపై సానుకూల ప్రభావం చూపుతుంది. పచ్చి మామిడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జీర్ణక్రియను బలోపేతం చేయడం ద్వారా శరీరంలో చెడు కొమ్ములను కలిగించే ప్రక్రియ వేగవంతమవుతుంది. పచ్చి మామిడిని తరుచు తీసుకోవడం వల్ల కొందరికి ఆమ్లత్వం పెరిగే అవకాశాలు ఉంటాయి. కావున దీన్ని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. రోజు కొద్దిగా తీసుకుంటే శరీరానికి లాభమే తప్ప నష్టం ఉండదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
