పల్లీలు నువ్వులు కలిపి తింటే ఎన్ని లాభాలో ??
పల్లీలు, నువ్వుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి శక్తిని అందించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ రెండు పదార్థాల్లోనూ హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పల్లీల్లో ఉండే నయాసిన్, నువ్వుల్లో ఉండే సెసమిస్ కలిసి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే పల్లీలు, నువ్వులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
అయితే నువ్వులు, పల్లీలు కలిపి తినవచ్చా? దానివల్ల లాభమా నష్టమా? తెలుసుకుందాం. పల్లీలు, నువ్వులు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన జింక్, ఐరన్ లాంటి ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని చక్కగా ఉంచుతాయి. పిగ్మెంటేషన్ సమస్యతో ఇబ్బంది పడేవారికి ఉపశమనం లభిస్తుంది. నువ్వుల్లో ఉండే లిగ్నాన్స్, పల్లీల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడుతుంది. వీటిలో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. పల్లీలు, నువ్వులు కలిపి తక్కువ పరిమాణంలో ప్రతిరోజు తింటే ఆకలిని కంట్రోల్ చేసి పోషకాలను అందిస్తాయి. ఇది కడుపులో సంతృప్తిని కలిగించి అధికంగా తినడాన్ని నివారిస్తుంది. నువ్వులు ఎక్కువగా తింటే వేడి చేస్తాయి. కానీ ఆరోగ్యానికి మంచివి. నువ్వుల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్, ఫ్యాట్స్, ప్రోటీన్, విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి6, బి9, సి, ఈ విటమిన్స్ అందుతాయి. చాలామంది నువ్వులు, పల్లీలు, బెల్లం కలిపి లడ్డూలను తయారుచేసుకొని తింటుంటారు. ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. బిపీని తగ్గిస్తుంది. రక్త కణాలను రిపేర్ చేస్తుంది. ఎముకలకు మేలు అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
