బరువు తగ్గాలనుకునే వారికి బఠానీలు బెస్ట్ చాయిస్
బటానీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి బటానీలు చాలా మంచివి. పచ్చి బటానీలలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బటానీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. తరచు ఆహారంలో పచ్చి బటానీలు చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆహార నిపుణులు. పచ్చి బటానీలలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. పచ్చి బటానీలలో ప్రోటీన్, విటమిన్ కె, బోలి ఎముకల వ్యాధిని నివారించడంలో ఇవి సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. గర్భిణీలు పచ్చి బటానీలు తింటే పిండాన్ని తగిన పోషణ అందుతుంది. శీతాకాలపు సమస్యలతో బాధపడేవారికి పచ్చి బటానీలు మేలు చేస్తాయి. బటానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో జింక్, రాగి, మాంగనీస్, ఐరన్ రోగాల బారిన పడకుండా రక్షిస్తాయి. రెగ్యులర్ గా తినడం వల్ల కాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు కాన్సర్ నిరోధిస్తుంది. పచ్చి బటానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. అలాగే వృద్ధాప్య ప్రభావాన్ని దూరం చేస్తుంది. పచ్చి బటానీలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మంచి బాక్టీరియాను పెంచుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి బటానీలు బెస్ట్ చాయిస్ అంటున్నారు నిపుణులు. వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పల్లీలు నువ్వులు కలిపి తింటే ఎన్ని లాభాలో ??

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
