ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
మానవ శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. ఇది సక్రమంగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. శరీరంలో విషపదార్థాలను వడపోయడం, జీర్ణక్రియకు సహాయపడటం, శక్తిని నిల్వచేయడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం వంటి కీలకమైన పనులను కాలేయం నిర్వర్తిస్తుంది. అయితే కాలేయం ఒత్తిడికి గురైనా లేదా అనారోగ్యం పాలైనా అది సరిగ్గా పనిచేయడం లేదు అనడానికి కొన్ని సంకేతాలను బయటపెడుతుంది.
ఈ సంకేతాలు తొలిదశలో చాలా సూక్ష్మంగా ఉంటాయి. కానీ వీటిని ముందుగానే గుర్తించడం రోగ నిర్ధారణ చికిత్స విషయంలో ఎంతో కీలకం. కాలేయ సమస్యలను సూచించే ఎనిమిది ముఖ్యమైన లక్షణాలను నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం సరైన నిద్ర ఆహారం తీసుకుంటున్న నిరంతరం తీవ్రమైన ఆలస్యత నీరసంగా అనిపిస్తుంటే అది కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కావచ్చు. ఇది కాలేయ సమస్యల్లో ఒక సాధారణ లక్షణం. కామెర్లు వ్యాధి కూడా కాలేయం వైఫల్యానికి ఒక సంకేతం అంటున్నారు. కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారడం కాలేయ వైఫల్యానికి స్పష్టమైన సంకేతంగా చెబుతున్నారు. మలం ముదురు రంగులోనే లేదా బాగా లేత రంగులో ఉండటం బైల్ ఉత్పత్తి లేదా ప్రవాహంలో సమస్యలను సూచిస్తుంది. ఇది కాలేయ పనితీరు మందగించడానికి మరో గుర్తు. కాలేయంలో వాపు లేదా ఇతర సమస్యల వల్ల కడుపు పైభాగంలో కుడివైపు నొప్పిగా లేదా పట్టేసినట్లు అనిపించవచ్చు. కొన్నిసార్లు యాసిడిటీస్ కడుపులో నీరుచేయడం వల్ల కూడా ఉబ్బరం గా ఉంటుంది. అనేక అనారోగ్యాలలో వికారం వాంతులు సాధారణమే అయినా స్పష్టమైన కారణం లేకుండా నిరంతరం వికారం లేదా వాంతులు అవుతుంటే అది కాలేయ సమస్యకు సూచన కావచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవిలో అడ్డంగా దొరికిన ప్రేమ జంట.. పోలీసులు వెళ్లేసరికి
అనకాపల్లి జిల్లాలో 13 అడుగుల కింగ్ కోబ్రా కలకలం
పురుషులకు ఈ మొక్క ఓ వరం.. కనిపిస్తే వదలకండి..!

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
