వేసవిలోనూ అల్లం టీ తాగుతున్నారా..?
సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని చాలామంది అల్లం టీ తాగుతూ ఉంటారు. నిజమే కానీ వేసవిలో మాత్రం దీన్ని తాగవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో ఎక్కువమంది అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలనొప్పి, అలసట, నీరసం వంటి సమస్యలను ఎదుర్కుంటారు. అల్లం టీ తాగడం వలన శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. ఫలితంగా వొంటి వేడి, అసౌకర్యం, చెమట వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇది వృద్ధులు, చిన్నపిల్లలు, నాజూకైన శరీరం కలవారికి మరింత ఇబ్బంది కలిగించవచ్చు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచటం చాలా అవసరం. అందుకే ఈ కాలంలో అల్లం టీ వాడకాన్ని తగ్గించడం మంచిదంటున్నారు. వేసవిలో అల్లం టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ పరిమాణంలో తాగితే గ్యాస్, యాసిడిటీ, అజీర్ణం, పుల్లటి తేనెపులు, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు కలగవచ్చు. వేసవిలో ఉష్ణోగ్రత ఎప్పటికే అధికంగా ఉన్నప్పుడు అల్లం టీ కారణంగా శరీరంలో వేడి మరింత పెరిగి జీర్ణ వ్యవస్థ తాళలేక ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి తలనొప్పి, అలసట, దాహం అధికంగా ఉండటం, వొళ్ళు బలహీనంగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎక్కువగా బయట తిరిగేవారు, క్రమంగా నీరు తాగనివారు ఈ సమస్యకు లోనవుతారు. అల్లం టీ వల్ల రక్తం పలుచబడే అవకాశం కూడా ఉంది. శీతాకాలంలో ఇది ఉపశమనం కలిగించినా వేసవిలో మాత్రం ఇది హానికరం కావచ్చు. ముఖ్యంగా రక్తాన్ని పలుచబెట్టే మందులు వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అల్లం టీ కారణంగా రక్తం మరింత పలుచగా మారి చిన్న గాయానికి కూడా ఎక్కువ రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలోని రక్తనాళాలపై ప్రభావం చూపేలా పనిచేస్తుంది. కొందరికి విరోచనాలు, పేగు సంబంధిత సమస్యలు, నిద్రలేమి, అధిక రక్తపోటు, స్కిన్ అలర్జీ వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వేసవిలో అల్లం టీ తాగడాన్ని తగ్గించాలి. శరీరానికి తగిన ఉష్ణోగ్రతను నిలుపుకోవాలంటే వేడి స్వభావం ఉన్న పానీయాలను విపరీతంగా తీసుకోవడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి
అప్పడాలు ఇష్టమని లొట్టలేసుకొని లాగించేస్తున్నారా..!
రోజూ ఒక్క పండు తింటే.. ఉక్కులా తయారవుతారు
Balakrishna: రజినీని రికార్డ్‌ను బద్దలు కొట్టిన బాలయ్య
సొంత తండ్రి నుంచే దారుణ వేధింపులు.. ఏడుస్తూ చెప్పిన హీరోయిన్

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
