రోజూ ఒక్క పండు తింటే.. ఉక్కులా తయారవుతారు
దానిమ్మ పండును ఔషధాల గనిగా చెప్పవచ్చు. ఇది రోజు ఒక్కటి తింటే చాలు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇది మా మాట కాదు నిపుణుల మాట. అవును దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తాయి అంటున్నారు నిపుణులు.
దానిమ్మ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రక్త ప్రసారాన్ని మెరుగుపరిచి రక్తపోటును తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఇతర పోషకాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దానిమ్మతో జీర్ణక్రియ మెరుగవుతుంది. దానిమ్మ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దానిమ్మ పండు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. తద్వారా చర్మం ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది. అకాల వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో ఇది సహాయపడుతుంది. దానిమ్మ గింజలు తక్కువ స్థాయిలో గ్లైసెమిక్ ను కలిగి ఉంటాయి. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు దివ్యౌషధం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: రజినీని రికార్డ్‌ను బద్దలు కొట్టిన బాలయ్య
సొంత తండ్రి నుంచే దారుణ వేధింపులు.. ఏడుస్తూ చెప్పిన హీరోయిన్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

