అనకాపల్లి జిల్లాలో 13 అడుగుల కింగ్ కోబ్రా కలకలం
అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు బుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. వి-మాడుగుల గణేష్ కాలనీలో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. చీపురుపల్లి వెంకటేష్ అనే ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. చీకటిపడ్డాక బయట నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పరిసరాల్లో ఏవో శబ్దాలు వినిపించాయి.
చుట్టూ చూసిన ఏమీ కనిపించలేదు. కానీ అదేపనిగా శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఇంటి గేటు సమీపాన ఆ శబ్దాలు మరింత గట్టిగా వినిపించాయి. బాగా వెతకగా.. బయట మురుగు కాల్వ మెట్ల వద్ద… ఏదో కదులుతూ కనిపించింది. టార్చ్ లైట్ వేసి చూడగా.. భారీ గిరి నాగు కనిపించింది. దీంతో భయంతో ఒక్కసారిగా పరుగులు తీశాడు. ఆ తర్వాత విషయాన్ని.. అటవీ శాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన.. వెంకటేష్.. పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. ఇంటి అరుగు కింద ఉన్న పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పాము లోపల ఇరుక్కుని ఉన్నట్టు గుర్తించాడు.. మొత్తంమీద గంటపాటు శ్రమించి.. కింగ్ కోబ్రాను పట్టుకొన్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును తీసుకెళ్లి సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పురుషులకు ఈ మొక్క ఓ వరం.. కనిపిస్తే వదలకండి..!
వేసవిలోనూ అల్లం టీ తాగుతున్నారా..?
వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

