Tirumala: శ్రీవారి ఆలయ అర్చకులతో ఈవో భేటీ.. మార్పుపై చర్చించిన అంశాలివే..

తిరుమల శ్రీవారి ఆలయ ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలతోపాటు పలు అంశాలపై టిటిడి ఈవో దృష్టి పెట్టారు. తిరుమల ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో సమీక్షించారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు. టిటిడి జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈవోకు వివరించారు.

Tirumala: శ్రీవారి ఆలయ అర్చకులతో ఈవో భేటీ.. మార్పుపై చర్చించిన అంశాలివే..
Ttd Eo
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 02, 2024 | 1:16 PM

తిరుమల శ్రీవారి ఆలయ ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలతోపాటు పలు అంశాలపై టిటిడి ఈవో దృష్టి పెట్టారు. తిరుమల ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో సమీక్షించారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు. టిటిడి జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈవోకు వివరించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అపరెంటీస్‎గా అవకాశం కల్పించాలన్నారు.

భవిష్యత్తును నిర్మించుకునేలా వేద విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని అర్చకులు ఈవోకు సూచించారు. గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను కనీసం ఏడాదిలో ఒక్కసారైనా నిర్వహించాలని ఈవోను కోరారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో కోవిడ్‌ సమయంలో తగ్గించిన ప్రసాద దిట్టం ఇంకా కొనసాగుతూనే ఉందని, దీన్ని పెంచాలని ఆలయ అర్చకులు శ్రీనివాస దీక్షితులు ఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ ప్రతిష్టటకు భంగం కలుగకుండా పురాతన సంప్రదాయాలు పరిరక్షించడం, ఆచారాలకు విఘాతం కలుగకుండా చూడటం తమ బాధ్యతని ఆగమ సలహాదారులు ఈవోవకు తెలిపారు. మోహనరంగాచార్యులు, సీతారామాచార్యులు, రామకృష్ణ దీక్షితులతోపాటు ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పోటు పీష్కార్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?
అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌ ట్రైన్‌ టికెట్‌ పొందడం ఎలా?
ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
పూజ సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
పూజ సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
వామ్మో.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
వామ్మో.. వర్షాకాలంలో ఈ పండ్లు తింటే ఇన్ని ప్రయోజనాలా?
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన మంత్రి..
100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు.. పేదలకు తీపికబురు చెప్పిన మంత్రి..
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
అద్వానీకి మళ్ళీ అస్వస్థత .. అపోలో ఆస్పత్రిలో చేరిక..
అద్వానీకి మళ్ళీ అస్వస్థత .. అపోలో ఆస్పత్రిలో చేరిక..
హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
వర్షాకాలంలో వంట గదిని ఇలా శుభ్రం చేస్తే దుర్వాసన, పురుగులు ఉండవు!
వర్షాకాలంలో వంట గదిని ఇలా శుభ్రం చేస్తే దుర్వాసన, పురుగులు ఉండవు!