Tirumala: ఇకపై ఆ వెబ్ సైట్లో టీటీడీ కీలక తీర్మానాలు.. పారదర్శకతే ప్రధాన లక్ష్యమన్న ఈవో..

టీటీడీ పాలన మరింత పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రీతిలో ప్రక్షాళన వైపు అడుగు లేస్తున్న టీటీడీ సమూల మార్పులు చేస్తోంది. టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయం భక్తులకు తెలియాలని నిర్ణయించింది. టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్‎లో తీర్మానాలను అందుబాటులో ఉంచింది. గత ప్రభుత్వంలో ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను అన్నింటినీ భక్తుల ముంగిట ఉంచి జవాబుదారీతనాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీలో ప్రభుత్వ మార్పు టీటీడీలో సమూల మార్పులకు కారణమైంది. ఏపీ సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టిన రోజునుంచే తిరుమలలో ప్రక్షాళన ఆరంభమైంది.

Tirumala: ఇకపై ఆ వెబ్ సైట్లో టీటీడీ కీలక తీర్మానాలు.. పారదర్శకతే ప్రధాన లక్ష్యమన్న ఈవో..
Ttd Website
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 02, 2024 | 1:37 PM

టీటీడీ పాలన మరింత పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రీతిలో ప్రక్షాళన వైపు అడుగు లేస్తున్న టీటీడీ సమూల మార్పులు చేస్తోంది. టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయం భక్తులకు తెలియాలని నిర్ణయించింది. టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్‎లో తీర్మానాలను అందుబాటులో ఉంచింది. గత ప్రభుత్వంలో ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను అన్నింటినీ భక్తుల ముంగిట ఉంచి జవాబుదారీతనాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీలో ప్రభుత్వ మార్పు టీటీడీలో సమూల మార్పులకు కారణమైంది. ఏపీ సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టిన రోజునుంచే తిరుమలలో ప్రక్షాళన ఆరంభమైంది. కొత్త ప్రభుత్వం టీటీడీలో తన మార్కు పాలన ఉండేలా కొరడా ఝుళిపిస్తోంది. ఈ మేరకు టీటీడీ ఈవోగా శ్యామల రావుకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం గత ఐదేళ్లలో భక్తులకు ఇబ్బందికరంగా ఉండేలా తీసుకున్న నిర్ణయాలపై దృష్టి పెట్టింది. తిరుమలకు వచ్చే భక్తులకు సంతృప్తికర దర్శనంతో పాటు.. తిరుమలలో సమూల మార్పులు తీసుకురావాలని భావించింది. ఈ మేరకు చర్యలు చేపట్టిన టీటీడీ ఈవో సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం, తిరుమల కొండపై పచ్చదనం పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. ఆకస్మిక తనిఖీలు, సమీక్షలు, చర్యలతో దూకుడు పెంచిన ఈవో దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరించారు. మరోవైపు టీటీడీ తీసుకునే నిర్ణయాలన్నీ భక్తులకు తెలియాలని భావించారు.

గతేడాది ఆగస్టు నుంచి టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు వెబ్ సైట్‎లో లేకపోవడాన్ని గుర్తించిన ఈవో టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్‎లోకి పాలకమండలి నిర్ణయాలను తీసుకొచ్చారు. 1993 మే నుంచి 2023 జూన్ వరకు పాలకమండలి నిర్ణయాలను టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్‎లో పొందు పరుచుతోంది. 2023 నుంచి టిటిడి బోర్డు తీసుకున్న తీర్మానాలు వెబ్ సైట్ పెట్టక పోవడం, ఈ అంశం వివాదాస్పదంగా కూడా మారింది. 2023 ఆగష్టు నుంచి 2024 మార్చి దాకా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు వెబ్ సైట్ లో లేకపోవడంతో ఆ తీర్మానాలన్నీ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. దాదాపు 450కి పైగా టీటీడీ బోర్డు తీర్మానాలను అఫీషియల్ వెబ్ సైట్‎లో టీటీడీ రెండు రోజులు క్రితం అప్లోడ్ చేసింది. టిటిడి నిధుల కేటాయింపు, బడ్జెట్‎కు మించి చేపట్టిన ఇంజనీరింగ్ పనులు, తీసుకున్న కీలక నిర్ణయాలు కొన్ని అప్పట్లో వివాదాస్పదం కాగా ఇప్పుడు ఆ నిర్ణయాలను వెబ్ సైట్‎లో భక్తుల ముందుకు వచ్చాయి. దీంతో టీటీడీ పాలనలో ప్రక్షాళన మొదలైందన్న సంకేతాలతోపాటు పారదర్శకపాలన వైపు అడుగులు వేస్తోందన్న చర్చ హాట్ టాపిక్‎గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తక్కువ ధరకే లైట్ వెయిట్ వీల్‌చైర్లు.. సౌకర్యాన్ని కోరుకునే వారికి
తక్కువ ధరకే లైట్ వెయిట్ వీల్‌చైర్లు.. సౌకర్యాన్ని కోరుకునే వారికి
తెలంగాణ సీపీగెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ సీపీగెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్ర బోస్.. 36 లక్షలతో సొంతూరికి..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్ర బోస్.. 36 లక్షలతో సొంతూరికి..
ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది..
ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది..
అమ్మేదీ కూరగాయలు.. చేసేదీ మాత్రం అదే పని..!
అమ్మేదీ కూరగాయలు.. చేసేదీ మాత్రం అదే పని..!
ఇవాళ్టి నుంచి ఏపీ టెట్‌ 2024 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఇవాళ్టి నుంచి ఏపీ టెట్‌ 2024 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ.. బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్
తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ.. బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్ న్యూస్ చెప్పిన టాటా.. ఏకంగా 1.33లక్షల వరకూ తగ్గింపులు..
గుడ్ న్యూస్ చెప్పిన టాటా.. ఏకంగా 1.33లక్షల వరకూ తగ్గింపులు..
నేటి నుంచి తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం
నేటి నుంచి తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం
ఈ యంగ్ హీరోస్ సినిమాల కోసం అంత కష్టపడ్డారా !!
ఈ యంగ్ హీరోస్ సినిమాల కోసం అంత కష్టపడ్డారా !!