Andhra Pradesh: మాకూ చదువుకోవాలని ఉంది సార్.. మా గ్రామానికి ఒక స్కూల్ కట్టించండి..

Anakapally News: కేవలం చదువు ఒక్కటే జీవితాల్ని మార్చగలదన్న వాస్తవం అందరికీ తెలుసు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత చదువుకోవడానికి ఒక గ్రామం ఇంకా అడుక్కోవాల్సి రావడం అంటే పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో అద్దం పడుతోంది. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‎ను ఓ గిరిజన గ్రామ విద్యార్థులు వేడుకుంటున్న తీరు కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే అది కనీస మౌలిక వసతులు లేని రోలుగుంట మండలం లోని లోసింగి గ్రామం.

Andhra Pradesh: మాకూ చదువుకోవాలని ఉంది సార్.. మా గ్రామానికి ఒక స్కూల్ కట్టించండి..
Tribal People
Follow us
Eswar Chennupalli

| Edited By: Aravind B

Updated on: Aug 01, 2023 | 6:59 PM

అనకాపల్లి, ఆగస్టు 1: కేవలం చదువు ఒక్కటే జీవితాల్ని మార్చగలదన్న వాస్తవం అందరికీ తెలుసు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత చదువుకోవడానికి ఒక గ్రామం ఇంకా అడుక్కోవాల్సి రావడం అంటే పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో అద్దం పడుతోంది. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‎ను ఓ గిరిజన గ్రామ విద్యార్థులు వేడుకుంటున్న తీరు కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే అది కనీస మౌలిక వసతులు లేని రోలుగుంట మండలం లోని లోసింగి గ్రామం. 250 మంది ఆదివాసీ గిరిజనులు ఆ గ్రామం లో జీవనం సాగిస్తున్నారు. గ్రామం మొత్తంలో 40 మంది వరకు విద్యార్థులు వివిధ తరగతులు చదువుతున్నారు. కానీ ఆ గ్రామంలో చదువుకోవడానికి పాఠశాల లేదు. వేరే స్కూల్‎కి వెళ్లాలంటే రోజూ 8 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి ఉంది. తమ గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసి అందులో ఒక టీచర్‌ను నియమించాలని మూడేళ్లుగా వాళ్ళు ఎక్కని ఆఫీస్ లేదు, మొక్కని అధికారి లేరు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. గతంలో కూడా కలెక్టర్‎కు, తమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన కరణం ధర్మశ్రీ‎కి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన రాలేదు.

స్పందనలో జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి

ఇవి కూడా చదవండి

లోసంగి గ్రామంలో  బడికి వెళ్ళే వయసున్న పిల్లలంతా చదువుకు దూరమవుతున్నారు. తరగతులు నిర్వహించేందుకు తాత్కాలికంగా మేమే ఒక స్థావరాన్ని ఏర్పాటు చేస్తామని, పాఠాలు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయుడ్ని నియమించాలని అంటూ గిరిజనులు పెద్ద సంఖ్యలో వచ్చి అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిసుభాష్ పఠాన్ శెట్టికి స్పందనలో విజ్ఞప్తి చేశారు. అర్ల పంచాయతీ శివారు లోసంగి, పితూరు గెడ్డ, పెదగరువు, నీలికుంట గిరిజన గ్రామాల్లో 40 మంది బడికి వెళ్ళే వయసున్న పిల్లలు ఉన్నారని.. వీరంతా ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారని ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమంలో గతంలోనే స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని తెలియజేశారు. కనీసం మీరైనా ఓ ఉపాధ్యాయుడ్ని నియమించి మాకు విద్యాబుద్ధులు నేర్పించాలనీ వేడుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రవి వీలైనంత త్వరలో టీచర్‎ను నియమిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు విద్యాశాఖకు కూడా నివేదిక ఇవ్వాలని కోరారు కలెక్టర్ రవి సుభాష్ పఠాన్ శెట్టి.