Watch Video: శ్రీకాళహస్తిలో శివలింగం కళ్లు తెరిచిందని ప్రచారం.. వింతను చూసేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు
Srikalahasti News: శ్రీకాళహస్తిలో వింత ప్రచారం జరిగింది. రాణిమహల్‌లోని శివాలయంలో శివలింగం కళ్లు తెరిచినట్టుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో స్థానిక భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీకాళహస్తిలో వింత ప్రచారం జరిగింది. రాణిమహల్‌లోని శివాలయంలో శివలింగం కళ్లు తెరిచినట్టుగా ప్రచారం జరిగింది. వింతను చూసేందుకు స్థానిక భక్తులు భారీగా తరలివస్తున్నారు. విభూతిని చూసి శివలింగం కళ్లు తెరిచినట్టుగా జనం భావించినట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న రాణిమహల్ శివాలయంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. నిన్న శివలింగానికి పూజారి అభిషేకం చేసివెళ్లారు. అదే గుడిలో అన్నపూర్ణ దేవి విగ్రహం కళ్లు తెరిచిందంటూ మరో ప్రచారం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాస్ ఆలయానికి చేరుకుని.. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
వైరల్ వీడియోలు
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
వీడిని అసలు మనిషంటారా..వీడియో

