TDP-Jana Sena: హాట్ సీటుగా ‘అనకాపల్లి’.. టీడీపీ, జనసేన టగ్ ఆఫ్ వార్.. రేసులో ఎవరున్నారంటే.?

అనకాపల్లి.. ఏపీలోనే ప్రత్యేకమైన పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. ఇక్కడ సీట్ల రాజకీయం ఈసారి ఆసక్తిగా మారింది. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు. అసలు ఏయే పార్టీలు బరిలో ఉంటాయనే దానిపై రోజు రోజుకూ సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సీటుపై నాగబాబు కన్నేయడంతో.. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా.. లేక జనసేన బరిలోకి దిగుతుందా? అనేది సస్పెన్స్‌గా మారింది.

TDP-Jana Sena: హాట్ సీటుగా 'అనకాపల్లి'.. టీడీపీ, జనసేన టగ్ ఆఫ్ వార్.. రేసులో ఎవరున్నారంటే.?
Tdp And Janasena
Follow us
Srikar T

|

Updated on: Feb 08, 2024 | 9:22 AM

అనకాపల్లి.. ఏపీలోనే ప్రత్యేకమైన పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. ఇక్కడ సీట్ల రాజకీయం ఈసారి ఆసక్తిగా మారింది. ఈ సీటుపై నాగబాబు కన్నేయడంతో.. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా.. లేక జనసేన బరిలోకి దిగుతుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్నట్లు తెరపైకి నాగ బాబు పేరు వచ్చింది. ఇప్పటికే ఆ సీట్ కోసం టీడీపీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది.  మధ్యే మార్గంగా జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణకు కేటాయిస్తారంటూ ప్రచారం సాగింది. అయితే ఇలాంటి తరుణంలో వీరందరూ కాదని నాగబాబు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలువనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు నిజం అనేలా వరుసగా నాగబాబు అనకాపల్లిలో పర్యటనలు చేస్తున్నారు. పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే కసరత్తు చేసిట్లు సమాచారం. ఫిబ్రవరి 8న పెందుర్తి, ఎలమంచిలి లో నాగబాబు పర్యటంచనున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఖరారు కాకపోవడంపైనా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ కోసం బైర దిలీప్, దాడి వీరభద్రరావు సహా చాలామందే క్యూలో ఉన్నారు. వాళ్లెవరూ కాదు మా అబ్బాయి విజయ్‌‌కే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఇటీవల మాడుగులలో రా కదలిరా సభ సందర్భంగా బహిరంగంగానే చంద్రబాబు ముందు వినతిపత్రం ఉంచారు అయ్యన్న. టికెట్ తమకే వస్తుందని టీడీపీలోని ముఖ్య నేతలంతా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అనకాపల్లి ఏంపీ స్థానంలో అసలు టీడీపీ పోటీ చేస్తుందా అనేదే అనుమానంగా మారింది.

జనసేన కీలక నేత నాగబాబు ఈ సీటుపై కన్నేయడంతో.. పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. 2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు.. ఈ సారి అనకాపల్లి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించిన నాగబాబు.. పాయకరావుపేటలో జనసేన నేతలతో సమావేశమమయ్యారు. ఈ పర్యటనలో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న చింతకాయల విజయ్ సైతం నాగబాబును కలిశారు. దీంతో ఇక్కడ టీడీపీ బరిలో ఉంటుందా.. లేదంటే ఈసారికి జనసేనకే సీటు కేటాయిస్తుందా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక అనకాపల్లి విషయంలో వైసీపీ కూడా కాస్త కన్ఫ్యూజన్‌లోనే ఉంది. ప్రస్తుత ఎంపీ బీశెట్టి సత్యవతినే కొనసాగించాలా లేక మార్చాలా అనే ఆలోచనలో ఉంది అధికార పార్టీ. జనసేన నుంచి నాగబాబు పోటీచేస్తే.. కౌంటర్‌గా మంత్రి అమర్‌నాథ్‌ను గానీ.. మరెవరినైనా బలమైన అభ్యర్ధిని గానీ బరిలో దింపాలనే ఆలోచన చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఏది ఏమైనా టీడీపీ – జనసేన అభ్యర్థి ఖరారయ్యాకే.. తమ అభ్యర్థిని ఎంపిక చేసే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది.

సరాసరిన 13 లక్షల 50 వేల మంది ఓటర్లు ఉన్న ఈ లోక్‌ సభ నియోజకవర్గంలో.. కాపు, గవర సామాజికవర్గాలతో పాటు వెలమలది కీలక ఓటు బ్యాంకు. మొత్తం ఓటర్లలో 70 శాతం ఈ మూడు సామాజికవర్గాల వాళ్లే ఉంటారు. అందుకే, అనకాపల్లి ఎంపీగా ఈ మూడు కమ్యూనిటీల నేతలే అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నారు. ఈ మూడు సామాజికవర్గాలు బలమైనవి కావడంతో.. ఇక్కడ క్యాస్ట్‌ ఈక్వేషన్‌ను చాలా జాగ్రత్తగా అప్లై చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. మరి ఈ ఈక్వేషన్లలో భాగంగా ప్రధాన పార్టీల నుంచి ఎవరికి టికెట్లు దక్కబోతున్నాయనేది ఆసక్తికర అంశం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..