Tomato Price: కొండెక్కిన టమాటో ధర.. ఈ ఏడాది ఇదే హయ్యెస్ట్ ప్రైస్.. పండుగ చేసుకుంటున్న వ్యాపారులు..
టమాటో ధర కొండెక్కింది. రికార్డ్ స్థాయిలో ఏకంగా 74 రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది ఇదే హయ్యెస్ట్ ప్రైస్ అంటున్నారు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు. దిగుబడి తగ్గడం..

Tomato prices Skyrocket: టమాటో ధర కొండెక్కింది. రికార్డ్ స్థాయిలో ఏకంగా 74 రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది ఇదే హయ్యెస్ట్ ప్రైస్ అంటున్నారు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు. దిగుబడి తగ్గడం.. ఇతర రాష్ట్రాల్లో టామాటో పంట లేకపోవడంతో అత్యధిక ధర పలుకుతోంది. మదనపల్లి మార్కెట్‌కు ప్రస్తుతం 150 మెట్రిక్ టన్నుల టమాటో దిగుమతి అవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది. అంటే నవంబర్ నెలాఖరు వరకు వంటింట్లో టమాటా కన్పించక పోవచ్చు.
చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లో కిలో టమాటా 74 రూపాయల వరకు పలుకుతోంది. అన్‌సీజన్‌లో అత్యధిక ధర నమోదైంది. గత నాలుగేళ్లుగా అన్‌సీజన్‌లో ఇదే అత్యధిక ధరని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దగా టమాటా దిగుబడులు లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి.
బయట మార్కెట్లలో పెద్దగా టమాటా కన్పించకపోవడంతో అంతా మదనపల్లి మార్కెట్‌కే వస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి టమాటా మదనపల్లి మార్కెట్‌కు వస్తోంది. అన్‌సీజన్‌లోనూ టమాటాకు మంచి ధర పలకడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అటు రైతులు మాత్రం ఎప్పటిలానే దళారుల చేతుల్లో మోసపోతున్నారు. ఇటు కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన సామాన్యులకు ఈ ధరలు మరింత షాకిచ్చాయి. అయితే సామాన్య ప్రజలు కూడా టమాటా అంటేనే వణికిపోతున్నారు.
ఇవి కూడా చదవండి: Drone Attack: బాగ్దాద్‌లో భారీ పేలుడు.. ప్రధానిని టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడి..
Income Tax: ఇళ్లు, భూమి కోనుగోలు చేస్తున్నారా.. ఈ విషయంను తప్పకా గుర్తుంచుకోండి..