AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Police Recruitment: పోలీస్ ప్రిలిమనరీ పరీక్షకు సర్వం.. నిమిషం దాటినా నో ఎంట్రీ..

మరికాసేపట్లో ఏపీలో ఎస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు నియామక మండలి జారీ చేసింది.

AP Police Recruitment: పోలీస్ ప్రిలిమనరీ పరీక్షకు సర్వం.. నిమిషం దాటినా నో ఎంట్రీ..
Ap Police Si Exam
Surya Kala
|

Updated on: Feb 19, 2023 | 6:27 AM

Share

ఏపీలో పోలీస్ ప్రిలిమనరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఇవాళ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రిలిమినరీ పరీక్ష పేపర్‌–1ను ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, పేపర్‌–2ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షకు 1.71 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పోలీసు నియామక మండలి పలు సూచనలు చేసింది. గాబరా పడకుండా ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలని చెప్పారు. ఎగ్జామ్ సెంటర్ లోకి గంటముందే అనుమతిస్తామని చెప్పారు అధికారులు.

ఉదయం 10గంటలకు జరిగే ఎగ్జామ్ కు 9 గంటల నుంచి, మధ్యాహ్నం పేపర్ -2 ఎగ్జామ్ కు 1.30 గంటలకే పరీక్షా హాల్ లో రావచ్చని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు బ్లూ/బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌, గుర్తింపు కార్డుగా ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్‌ కార్డుల్లో ఏదైనా తీసుకురావాలని చెప్పారు. మొబైల్‌ ఫోన్, టాబ్లెట్‌/ల్యాప్‌టాప్, పెన్‌ డ్రైవ్, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్, కాలిక్యులేటర్, లాగ్‌ టేబుల్, వాలెట్, పర్సు, నోట్స్, చార్ట్‌లు వంటివాటితో పాటు ఎలాంటి కాగితాలు, రికార్డింగ్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని చెప్పారు. వాటిని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లూ చేయడం లేదని .. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పోలీస్ నియామక మండలి సూచనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..