Kodali Nani: ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే కొడాలి నాని.. దళితులకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం జగన్…

గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో పల్లె వెలుగు బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే కొడాలి నాని హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Kodali Nani: ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే కొడాలి నాని.. దళితులకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం జగన్...
Kodali Nani Bus Driving
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2023 | 7:58 AM

ఉమ్మడి కృష్ణాజిల్లా లోని గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో పల్లె వెలుగు బస్సులను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. గుడివాడ ఆర్టీసీ డిపోకు కొత్తగా వచ్చిన ఐదు హైర్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో పల్లె వెలుగు బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే కొడాలి నాని హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ నూతన సర్వీసులు గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. ఈ బస్సులు S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోడలి నాని మాట్లాడుతూ.. దళిత వర్గాల శ్రేయస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు, ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం సంతోషకరని చెప్పారు.

ఇవి కూడా చదవండి

సీఎం జగన్ ఈ పథకాన్ని దళితుల కోసం కేటాయించడం వల్ల అనేకమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. అసలు ఏపీలో దళితుల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..