Divya Vani: మా అందరిలో రోజా భిన్నం.. మంత్రి రోజాపై దివ్య వాణి ప్రశంసల వర్షం.. అవకాశం వస్తే.. కలిసి పనిచేస్తా..

శారద, జయప్రద, జయసుధ, కవిత, రోజా వీరంతా పార్టీ నుంచి ఏదొక రూపంలో బయటకు వచ్చిన వారే అంటూ గుర్తు చేసుకుంది. అయితే వీరందరిలో రోజా భిన్నమని.. టీడీపీ నుంచి బయటకు వచ్చినా.. రియల్ పొలిటిషన్ గా మారి.. నేడు మంత్రిగా ప్రజలకు సేవలకు చేస్తున్నారంటూ దివ్య వాణి మంత్రి ఆర్కే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు.

Divya Vani: మా అందరిలో రోజా భిన్నం.. మంత్రి రోజాపై దివ్య వాణి ప్రశంసల వర్షం.. అవకాశం వస్తే.. కలిసి పనిచేస్తా..
Divya Vani Roja
Follow us

|

Updated on: Feb 16, 2023 | 10:31 AM

సీనియర్ నటి టీడీపీ మాజీ స్పోక్ పర్సన్ దివ్య వాణి తెలుగుదేశం పార్టీలో చేరి.. తనదైన శైలిలో దూకుడు చూపించారు. హఠాత్తుగా టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవల ఈ బాపు బొమ్మ తన రాజకీయ జీవితంపై స్పందిస్తూ.. తాను టీడీపీ నుంచి తనంతట తాను వచ్చేశానో.. లేక వారే పంపించారో.. ఏదైతేనేనేమిటి.. మొత్తానికి పార్టీ నుంచి బయటకు వచ్చేశాను అన్నారు. ఇలా తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన నటీమణుల్లో తానొక్కతే కాదని.. శారద, జయప్రద, జయసుధ, కవిత, రోజా వీరంతా పార్టీ నుంచి ఏదొక రూపంలో బయటకు వచ్చిన వారే అంటూ గుర్తు చేసుకుంది. అయితే వీరందరిలో రోజా భిన్నమని.. టీడీపీ నుంచి బయటకు వచ్చినా.. రియల్ పొలిటిషన్ గా మారి.. నేడు మంత్రిగా ప్రజలకు సేవలకు చేస్తున్నారంటూ దివ్య వాణి మంత్రి ఆర్కే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎందుకంటే.. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లే నటీమణులంటే చాలా చిన్న చూపుచూస్తారని.. వారికీ జనంలో గౌరవం తగినంతగా లేదని అన్నారు. అయితే రోజా సినిమా వారు కూడా అందునా మహిళలు కూడా రాజకీయాల్లో రాణించగలని  మరోసారి రుజువు చేశారంటూ దివ్య వాణి చెప్పారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్యవాణి మాట్లాడుతూ.. టీడీపీలో ఉన్నప్పుడు రోజా తాను కలిసి పనిచేసినట్లు.. తమ ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవని చేప్పారు. అంతేకాదు భవిష్యత్ లో రోజాతో కలిసి పనిచేయాల్సి వస్తే.. తప్పకుండా కలిసి పనిచేస్తానని.. తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు దివ్యవాణి. తన భర్త తనకు అన్ని విధాలా అండగా ఉంటారని.. సినిమాలు,రాజకీయాలు,ఇలా అన్ని విషయాల్లోను సలహాలు సూచనలు ఇస్తారని చెప్పారు బాపు బొమ్మ. తాను ఏ పార్టీలో చేరనున్నదనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నానని.. మళ్లీ రాజకీయ ప్రయాణం చేస్తానని చెప్పింది దివ్యవాణి. అంటే దివ్య వాణి ఇప్పుడు వైసీపీ లో చేరాలని చూస్తుందా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి మంత్రి రోజా దివ్య వాణి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి