Morri Pandlu: ఈ పండ్లు కనిపిస్తే వెంటనే తినండి.. రుచితోపాటు మహా అద్భుతమైన ఆరోగ్యం..

MORRI PANDLU: ఈ పండ్లలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చని రంగులో ఉంటుంది. అదే దోరగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో.. ఆ తర్వాత బాగా పండిన తర్వాత నలుపు రంగులోకి మారిపోతాయి.

Morri Pandlu: ఈ పండ్లు కనిపిస్తే వెంటనే తినండి.. రుచితోపాటు మహా అద్భుతమైన ఆరోగ్యం..
Cuddapah Almond
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 16, 2023 | 11:30 AM

ఆదిలాబాదు, శ్రీకాకుళం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా దొరికే పండు ఇది. అడవి ప్రాంతం అధికంగా ఉండే జిల్లాల్లో గిరిజన పంటగా మొర్రి పండ్లును చెప్పవచ్చు. ఇక్కడ మాత్రమే మొర్రి పండ్లు విరివిగా లభిస్తాయి. ఈ చెట్లు పొలాల గట్ల ఇరువైపులా కనిపిస్తాయి. ఈ కాయలు తియ్యగా పుల్లగా ఉంటాయి. ఈ చెట్టు నిండా సన్నని ముళ్ళు ఉంటాయి. ఈ చెట్టును మొర్రి పండ్లు చెట్టు, మొర్రి పండ్లు చెట్లు అని పిలుస్తారు.మొర్రి పండ్లను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండ్ల‌ను పిల్లల‌తో తినిపించడం వ‌ల్ల పిల్ల‌ల్లో ఎదుగుద‌ల బాగా ఉంటుంది. పిల్లలు దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా మారుతారు. ఈ కాయ‌లు ప‌చ్చ‌గా ఉన్నప్పుడు ప‌చ్చ రంగులో, దోర‌గా ఉన్న‌ప్పుడు ఎరుపు రంగులో, పండినప్పుడు న‌ల్ల‌గా ఉంటాయి. మొర్రి పండ్లు తిన‌డానికి చాలా రుచిగా ఉంటాయి.

వీటిని పండంచరు.. ఇవి కేవలం అడవి ప్రాంతాల్లో కానీ.. పొలం గట్లపై ఇవి కనిపిస్తుంటాయి. రసాయనాలు ఉండవు కాబట్టి వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మొర్రి పండ్లలో  ఒక గింజ మాత్ర‌మే ఉంటుంది. కానీ ఈ గింజకు డ్రై ఫ్రూట్ మార్కెట్‌‌లో బంగారంతో సమానం అని చెప్పవచ్చు. అయితే ఈ గింజ‌తో క‌లిపి పండును మొత్తం తింటూ ఉంటారు. ఈ మొర్రి పండ్లును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

వివిధ భాషలలో దీనిని ఏమంటారు?

  1. మలయాళం: నురామరం
  2. ఒరియా: చంహ్రా
  3. కన్నడ: కోల్ మావు
  4. తెలుగు: మొర్రి పండ్లు
  5. ఇంగ్లీష్: చిరోంజి ఫ్రూట్

మొర్రి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు..

మొర్రి పండ్లే క‌దా అని వీటిని త‌క్కువగా అంచనా వేయ‌కూడ‌దు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మయ్యే ముఖ్య‌మైన పోష‌కాల‌ను అందించ‌డంలో ఈ పండ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మొర్రి పండ్లను బొటానికల్ పేరు బుంచనానియా లాటిఫోలియా. ఇతర సాధారణ పేరు చిరోంజి పండు. ఇది జాము ద్రాక్షతో సమానమైన రుచిని కలిగి ఉంటుంది. మొర్రి పండ్లు పీచు, విటమిన్ బి1, బి2, సి, నియాసిన్, ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ బెర్రీ రకం పండ్లను ఎండబెట్టి, పండు గింజలను డెజర్ట్‌లలో ఒక పదార్ధంగా ఉపయోగిస్తారు.

ప్రయోజనాలు:

  • సహజ శీతలకరణిగా పనిచేస్తుంది
  • చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
  • బరువు తగ్గడంలో సహాయపడుతుంది
  • అతిసారం చికిత్స చేస్తుంది
  • కాలేయ ఆరోగ్యానికి మంచిది
  • అల్సర్‌లను తగ్గిస్తుంది
  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

చిరోంజీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చిరోంజి మలబద్ధకం సమస్యలో ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది. దీని ప్రభావం చల్లగా ఉంటుంది. ఇది మీ పొట్టకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇటువంటి పోషకాలు చిరోంజి లోపల కూడా కనిపిస్తాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం