గోరువెచ్చని నీటి వల్ల సాధారణ ఫ్లూ, జలుబుతో పోరాడుతుంది. సైనస్ సమస్యలతో బాధపడేవారికి ఇది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పర్చడంలో సహాయపడుతుంది. వేసవిలో ఈ గోరువెచ్చని నీరు తాగడం అనేది కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఏడాది పొడవున ఈ నీరు తాగే అలవాటున్న వారికి సులభంగా అనిపిస్తుంది.