Andhra Pradesh: చంద్రబాబును మించిన సైకో ఎవరూ లేరు.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి కురసాన కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు...
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి కురసాన కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబేనన్న కన్నబాబు.. నారా లోకేశ్ ఐరన్ లెగ్ అని మండిపడ్డారు. ప్రజలే ఇలా చెప్పుకుంటున్నారని చెప్పారు. గుంటూరు, కందుకూరులో అమాయకులను పొట్టనపెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, అన్ని రంగాల్లో దూసుకుపోతోందని పేర్కొన్నారు. 2019 తర్వాత ఏ ఒక్క ఎన్నికల్లోనైనా టీడీపీ గెలిచిందా? అని కన్నబాబు నిలదీశారు.
టీడీపీకి బలం లేదు. అందుకే మిగిలిన పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణం. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. నిర్వాసితులను గాలికి వదిలేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాం. చంద్రబాబును మించిన సైకో ఎవరూ లేరు. ప్రభుత్వం మీద బురద చల్లడమే టీడీపీ ఎజెండా. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి
కాగా.. గతంలోనూ చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటర్ వ్యవస్థపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల వల్లే ప్రజలకు నేరుగా పథకాలు అందుతున్నాయన్నారు. జన్మభూమి కమిటీల వంటి దళారీ వ్యవస్థను నిర్మూలించింది ఈ వ్యవస్థలేనని కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం