Andhra Pradesh: ఎదురొచ్చిన మృత్యువు.. కారును ఢీ కొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం..

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ వద్ద.. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయింది. తెలంగాణ రాష్ట్రం పేరుతో రిజిస్టర్..

Andhra Pradesh: ఎదురొచ్చిన మృత్యువు.. కారును ఢీ కొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం..
Bus Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2023 | 6:28 AM

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ వద్ద.. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయింది. తెలంగాణ రాష్ట్రం పేరుతో రిజిస్టర్ అయిన ఓ కారు.. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తోంది. మేదరమెట్ల దక్షిణ బైపాస్‌ సమీపంలోకి రాగానే కారు టైరు పంక్చరైంది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్‌ ను దాటి అవతలి వైపు ఎగిరి పడిపోయింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అద్దంకి ఎస్ఐ సమందరవలికి చెందిన కారుగా గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక కారు డ్రైవర్ ఉన్నారు.

మృతుల్లో ఎస్ఐ సమందర్ వలి భార్య, కూతురు, మరదలు, మరో మహిళ, కారు డ్రైవ ఉన్నారు. సంఘటనా స్థలంలో భార్య, కూతురు మృతదేహాలను చూసి అద్దంకి ఎస్ ఐ సమందర్ వలి కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై విలపించడాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న సహచర పోలీసులు… అనంతరం ఎస్ఐ ని సముదాయించారు. కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?