AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palnadu: వ్యక్తుల మధ్య విబేధాలు.. నాశనం అవుతున్న పచ్చని పంటలు

అది నూజెండ్ల మండలం పెరుమాళ్లపల్లి... వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు ఇద్దరిది అదే గ్రామం.. దూరపు బంధురికం కూడా ఉంది. శ్రీనివాసరావు తన పొలంలో పొగాకు పంట సాగు చేశాడు. పొగాకు పంట ఏపుగా పెరిగింది. మరికొద్దీ రోజుల్లో కోతకు కూడా రానుంది. అయితే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొగాకు పంటపై స్వైర విహారం చేశారు. ఇరవై ఐదు సెంట్ల భూమిల్లో పొగకు పంట మొత్తాన్ని పీకేశారు.

Palnadu: వ్యక్తుల మధ్య విబేధాలు.. నాశనం అవుతున్న పచ్చని పంటలు
Crop Damage
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 06, 2024 | 5:41 PM

Share

పాత కక్షల నేపధ్యంలో పంటలు ధ్వంసం అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు చోరికి గురవుతున్నాయి. పగలు సెగలు రేగే పల్నాడులో ఇప్పుడు కొత్త సంస్కృతి కలవర పెడుతోంది. తమ ప్రత్యర్థిపై చేయి సాధించేందుకు ఆరుగాలం కష్టించి పడించిన పంటలను, పంట ఉత్పత్తులను ధ్వంసం చేస్తునారు, తగులబెట్టేస్తున్నారు. వరుస వెంట జరుగుతున్న ఘటనలు పల్నాడు వాసులు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి…

అది నూజెండ్ల మండలం పెరుమాళ్లపల్లి… వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు ఇద్దరిది అదే గ్రామం.. దూరపు బంధురికం కూడా ఉంది. శ్రీనివాసరావు తన పొలంలో పొగాకు పంట సాగు చేశాడు. పొగాకు పంట ఏపుగా పెరిగింది. మరికొద్దీ రోజుల్లో కోతకు కూడా రానుంది. అయితే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొగాకు పంటపై స్వైర విహారం చేశారు. ఇరవై ఐదు సెంట్ల భూమిల్లో పొగకు పంట మొత్తాన్ని పీకేశారు. తెల్లవారు జామున పొలానికి వెళ్లి చూసిన శ్రీనివాసరావు కన్నీరు పెట్టుకున్నాడు. ఇన్నీ రోజులు కంటిపాపలా సాగు చేస్తున్న పంట చేతికి రాకముందే నేలపాలైంది. అయితే ఇందుకు వెంకటేశ్వరావే కారణమని శ్రీనివాసరావు అతని భార్య భావించారు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరి మధ్య పదేళ్ల నుండి భూ వివాదం నెలకొంది. ఇరవై ఐదు సెంట్లు నాదంటే నాదేనని ఇద్దరూ తగదా పడుతున్నారు. శ్రీనివాసరావు చెబుతున్న వివరాల ప్రకారం..  గత పదేళ్ల క్రితమే తమ పొలం పక్కనే ఉన్న ఇరవై ఐదు సెంట్ల భూమిని వెంకటేశ్వరావు వద్ద నుండి కొనుగోలు చేశారు. ఆన్ లైన్ లో కూడా శ్రీనివాసరావు పేరే ఉంది. అప్సటి నుండి తన పొలంతో పాటు ఇరవై ఐదు సెంట్ల భూమిలో కూడా పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఇరవై ఐదు సెంట్ల భూమిని తాము అమ్మలేదని వెంకటేశ్వరావు అంటున్నారు. దీనిపై దేవుడి గుడిలో ప్రమాణం చేయడానికి రావాలంటూ గత కొంతకాలంగా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం ఇరవై ఐదు సెంట్ల భూమిలో పంటను ధ్వంసం చేశారు.

గతంలో వినుకొండ మండలం నడిగడ్డలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి పంటను ధ్వంసం చేశారు. రాత్రికి రాత్రే పంటను పీకేశారు. ప్రత్యర్ధులే తమ పంటను ధ్వంసం చేశారని వెంకటేశ్వర్లు ఆరోపించారు. తరుచూ పంటలను ధ్వంసం చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవతున్నాయి. వ్యక్తుల మధ్య విబేధాలతో పంటలను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…