AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం ధర.. మరో ఏడాదిలో రూ. 80వేలకు ?

బంగారం ధర మళ్లీ కొండెక్కి కూర్చుంది. ఆకాశం వైపే చూస్తోంది. రికార్డులు బద్దలుకొడుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర అక్షరాలా 66 వేలు. ఇప్పుడే ఇలా ఉంటే.. వేసవిలో పెళ్లిళ్ల సీజన్‌ నాటికి పరిస్థితి ఏంటి? అని బెంబేలెత్తిపోతున్నారు జనం.

Gold Rate: మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం ధర.. మరో ఏడాదిలో రూ. 80వేలకు ?
Gold Price
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2024 | 5:52 PM

Share

రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు. గతేడాది ఇదే సమయానికి 60 వేలు దాటితే.. ఇప్పుడు 65 వేల మార్క్ క్రాస్ చేసింది. 2018లో 30వేలున్న పది గ్రాముల పసిడి ధర.. ఆరేళ్లు గడిచేసరికి రెండింతలైంది. మరో ఏడాదిలోగా 80వేలకు చేరవచ్చన్నది ఒక అంచనా. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మంగళవారం ఒక్కరోజే 800 రూపాయలు పెరిగింది. గత వారం రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర 2,300 పెరిగింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పసిడి ధరల దూకుడు ఏ రేంజ్‌లో ఉందో. స్వతహాగా భారతీయ మహిళలు ఆభరణ ప్రియులు. పైగా శుభ సందర్భం ఏదైనా తాహతుకు తగ్గట్టు ఎంతోకొంత బంగారం కొనుగోళ్లు తప్పనిసరి. అందుకే కొనుగోళ్ల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు.

పుత్తడి ఇంత ప్రియం ఎందుకవుతోంది..? అంటే.. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు.. ఆర్థిక అనిశ్చితి కొనసాగడం.. ఇలా అనేక కారణాలు చెబుతారు ఎక్స్‌పర్ట్స్. దీనికి తోడు భౌగోళిక, రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరల్ని శాసిస్తాయి. సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటిగా మారడంతో పసిడి వైపు పెట్టుబడులు తరలివస్తున్నాయి. క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరగడానికి మరో కారణం.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. అటు.. బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఒక సెంటిమెంట్‌గా మారిందని, దాన్ని ఎవరూ ఆపలేరని ధీమాతో ఉన్నారు జ్యుయెలరీ వ్యాపారులు. ప్రస్తుతానికి ఏప్రిల్ నెలనుంచి కొన్నిరోజులు సుముహూర్తాలు లేవు. ఇప్పుడు అమ్మకాలు మందగించినా.. ఆ తర్వాత పుంజుకుంటాయనేది ఒక అంచనా. సో.. పుత్తడి ధరకు కళ్లెం పడే ఛాన్స్ లేనట్టే మరి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి