Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. జనవరి కోటా ఆర్జిత సేవా టికెట్ల విడుదల ఆరోజే.. ఎలా బుక్ చేసుకోవాలంటే?
14వ తేదీ మధ్యాహ్నం డిప్ ద్వారా భక్తులకు సేవా టిక్కెట్లు టీటీడీ కేటాయించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ, సంబంధిత దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జనవరి నెల కోటాకు సంబంధించి స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆరోజు ఉదయం10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. 14వ తేదీ మధ్యాహ్నం డిప్ ద్వారా భక్తులకు సేవా టిక్కెట్లు టీటీడీ కేటాయించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ, సంబంధిత దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి.. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. నకిలీ వెబ్‌సైట్‌లను చూసి మోసపోవద్దని హెచ్చరించింది.
కొనసాగుతోన్న రద్దీ..
ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని 51,376 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.6 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే స్వామివారికి 24,878 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..