AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో టీనేజర్ మృతిపై స్పందించిన టీటీడీ.. వీడియో విడుదల

తిరుమలలో టీనేజర్ మృతిపై జరుగుతున్న వివాదానికి టీటీడీ ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. అతడి మృతికి కారణాలు చూపిస్తూ సీసీటీవీ ఫుటేజ్‌ రిలీజ్‌ చేసింది. దీనిపై సమగ్ర వివరణ ఇచ్చింది. టీటీడీపై బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించింది. ఇంతకీ బాలుడు ఎలా చనిపోయాడు..? టీటీడీ ఇచ్చిన క్లారిటీ ఏంటో తెలుసుకుందాాం పదండి...

Tirumala: తిరుమలలో టీనేజర్ మృతిపై స్పందించిన టీటీడీ.. వీడియో విడుదల
Tirumala
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2025 | 8:55 AM

Share

తిరుమల అన్నదాన సత్రంలో టీనేజర్ మృతిపై టీటీడీ స్పందించింది. టీనేజర్ మంజునాథ్ మృతి దురదృష్టకరమన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తోపులాట వల్లే అతను చనిపోయారన్నది అవాస్తవమన్నారు. టీనేజర్ మృతికి సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలించామని తెలిపారు. ర్యాంప్‌పై పరిగెత్తుతూ అతను కిందపడ్డాడని… అతనికి ఇదివరకే గుండె సంబంధిత చికిత్స జరిగిందిని వివరించారు.

తిరుమలలో ఈనెల 22న మంజునాథ అనే టీనేజర్ అన్నప్రసాద కేంద్రంలో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విజిలెన్స్‌ సిబ్బంది వెంటనే స్పందించి సీపీఆర్‌ చేసి.. తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆ టీనేజర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అన్నదాన సత్రంలో తొక్కిసలాట జరగడం వల్లే మంజునాథ మృతి చెందాడని ప్రచారం జరగడంతో.. ఈ ఘటనను టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి వివరణ ఇచ్చింది. దీంతో తొక్కిసలాటతోనే టీనేజర్ మృతి చెందాడు అన్న వివాదినికి ఫుల్ స్టాప్‌ పడింది.

శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవు : టీటీడీ చైర్మన్ హెచ్చరిక

శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్  బి.ఆర్.నాయుడు హెచ్చరించారు. టీటీడీ పీఆర్వో అని చెప్పుకుంటూ ప్రసాద్ అనే పేరుతో చెలామణి అవుతూ ఛైర్మన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి శ్రీవారి దర్శన టికెట్ల ఆశజూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ భక్తుడు గోపాల్ రాజు చైర్మన్ కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో చైర్మన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఆదేశించారు. విజిలెన్స్ వింగ్ సిబ్బంది బాధితుడి నుండి వివరాలు సేకరించి చేపట్టిన ప్రాథమిక విచారణలో నిందితుడు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్ గా గుర్తించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నెం: 18/2025తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ వారి దగ్గర నుండి డబ్బు ముట్టాక వారిని గ్రూప్ నుండి రిమూవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా నకిలీ వెబ్ సైట్లను, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే దర్శనం, వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..