Tirumala: తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల అమ్మకం.. నలుగురిపై కేసు నమోదు..
తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. నకిలీ టికెట్ల వ్యవహారంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు...
తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. నకిలీ టికెట్ల వ్యవహారంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్ నరేంద్రపై కేసు పెట్టారు. లడ్డూ కౌంటర్ ఉద్యోగి అరుణ్‌రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీపై కూడా కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురికి వీరు నకిలీ దర్శన టికెట్లు విక్రయించారు. మూడు రూ.300 దర్శన టికెట్లను రూ.21 వేలకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు భక్తులను అదుపులోకి తీసుకుని విజిలెన్స్ అధికారులు విచారించగా ఈ విషయం బయటపడింది. నకిలీ టికెట్ల వ్యవహారం కొన్నాళ్లుగా జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
Read Also.. Car Launches: 2022లో విడుదల కానున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఖరీదుండే కార్లు ఇవే..!