తిరుమల కొండపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్..మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌కుమార్..‌ఏపీ ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుంది. సెలబ్రెటీలు అందరు మొక్కలు నాటుతూ... తన సహచరులకు మొక్కలు నాటాలని సూచిస్తున్నారు.

తిరుమల కొండపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్..మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌కుమార్..‌ఏపీ ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 17, 2020 | 5:55 AM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుంది. సెలబ్రెటీలు,సామాన్యులు అందరు మొక్కలు నాటుతూ… తన సహచరులకు మొక్కలు నాటాలని సూచిస్తున్నారు. ఇలా  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు సాగుతూ ఉంది. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారిని ఎంపీ సంతోష్‌కుమార్‌ బుధవారం దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి.. స్వామివారి వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి ఏపీ ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ..స్వామి సన్నిధిలో 365 రోజుల పాటు పూలుపూసే మొక్కలను నాటాలనే సంకల్పానికి శ్రీకారంగా ఎంపీ సంతోష్‌ చేతులమీదుగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. వాతావరణంలో సమతుల్యత రావాలంటే.. మొక్కలు విరివిగా నాటాలని  ఆయన పిలుపునిచ్చా రు.