AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్తూరు ఘటనలో విస్తుపోయే నిజాలు.. అక్క భర్తపై పలు అనుమానాలు.. కూపీ లాగుతున్న పోలీసులు..

చిత్తూరు జిల్లా గట్టుకింద పల్లెలో యువతి సుమతిపై పెట్రోల్ పోసి తగులపెట్టిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సుమతి అక్క భర్త అయిన వెంకటేష్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చిత్తూరు ఘటనలో విస్తుపోయే నిజాలు.. అక్క భర్తపై పలు అనుమానాలు.. కూపీ లాగుతున్న పోలీసులు..
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2020 | 5:53 PM

Share

చిత్తూరు జిల్లా గట్టుకింద పల్లెలో యువతి సుమతిపై పెట్రోల్ పోసి తగులపెట్టిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సుమతి అక్క భర్త అయిన వెంకటేష్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా గట్టుకింద పల్లిలో సుమతి (24) అనే యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న సమయంలో హత్యాయత్నం జరిగినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. తీవ్రగాయాలపాలైన యువతిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. సుమతికి మరో వారం రోజుల్లో పెళ్ళి కావాల్సి ఉంది. ఘటన జరిగిన స్థలంలో 15 కోళ్ళు, రెండు కుక్కలు, ఒక పిల్లి చనిపోయి ఉన్నాయి. ఘటనకు ముందు ఆమె బావ వెంకటేష్ కుక్కలు, కోళ్ళపై విషప్రయోగం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు కుక్కలు మొరగడంతో వాటికి విషప్రయోగం చేసినట్లుగా తెలుస్తోంది. వెంకటేశ్ భార్య చెల్లెలు సుమతిని కూడా తనకే ఇచ్చి పెళ్ళి చేయాలని ఆమె తండ్రి శివయ్యను వెంకటేశ్ అడిగాడు. ఇద్దరు అక్కాచెల్లెల్లకు తానే భర్తగా ఉంటానని చెప్పాడని, అందుకు సుమతి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇంకో వారం రోజుల్లో పెళ్ళి కావాల్సిన కూతురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుతో పోరాడుతుండడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం సుమతి బావ వెంకటేశ్‏ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తిరుపతిలోకి రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.

ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..