AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విధి ఆడిన నాటకం.. రోడ్డు యాక్సిడెంట్‌లో ఆంబులెన్స్‌లోని పేషెంట్ సహా నలుగురు దుర్మరణం..

Chittoor District: ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ట్యాంకర్‌ను ఆపివేయడం, నిద్ర మత్తులో వేగంగా వెళుతున్న అంబులెన్స్ డ్రైవర్ గమనించకుండా ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒరిస్సాకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు..

విధి ఆడిన నాటకం.. రోడ్డు యాక్సిడెంట్‌లో ఆంబులెన్స్‌లోని పేషెంట్ సహా నలుగురు దుర్మరణం..
Road Accidents In Chittoor
Raju M P R
| Edited By: |

Updated on: Sep 15, 2023 | 12:49 PM

Share

చిత్తూరు జిల్లా, సెప్టెంబర్ 15: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. అలాగే మరో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉంది. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో కేవీ పల్లి మండలం మఠం పల్లి వద్ద తుఫాన్ వెహికల్ లారీని ఢీకొనడంతో 5 మంది మృతి చెందగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని బెల్గాం జిల్లా అత్తిని తాలూకా బడని గ్రామానికి చెందిన 16 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో బెల్గాం జిల్లా అతిని గ్రామానికి హనుమంతు, అంబికా, శోభ, మనందతో పాటు హనుమంతు అనే మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 16 మంది ఉండగా 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు చెప్పారు. గాయపడ్డ వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండగా తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి గురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిన గుర్తించారు పోలీసులు.

చిత్తూరు జిల్లాలోనే జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరితో పాటు ప్రయాణించిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తవణంపల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు తిరుపతి హైవేపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. భువనేశ్వర్‌కి చెందిన పేషెంట్‌ను బెంగళూరు నుంచి  తీసుకెళ్తున్న అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో అంబులెన్స్‌లో ఉన్న 7 మందిలో నలుగురు మృతి చెందగా మృతుల్లో మహిళతో పాటు ముగ్గురు మగవాళ్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ట్యాంకర్‌ను ఆపివేయడం, నిద్ర మత్తులో వేగంగా వెళుతున్న అంబులెన్స్ డ్రైవర్ గమనించకుండా ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒరిస్సాకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, రాత్రి వేళల్లో ప్రయాణించేవారు వాహనాలను నెమ్మదిగా నడపాలని పోలీసులు కోరుతున్నారు. అతి ప్రమాదమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్న నేపథ్యంలో సాధ్యమైనంతలో నెమ్మదిగానే వెళ్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో