AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు.. మాజీ చైర్మన్ పీఏను ప్రశ్నిస్తున్న అధికారులు

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే టీడీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే.. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) నోటీసులు ఇచ్చింది.

Tirumala Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు.. మాజీ చైర్మన్ పీఏను ప్రశ్నిస్తున్న అధికారులు
Tirumala Tirupati Laddu
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2025 | 1:51 PM

Share

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే టీడీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే.. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా రెండు రోజుల నుంచి సిట్ అధికారులు అప్పన్నను ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు తిరుమల ఉద్యోగులను సిట్‌ విచారిస్తోంది. వారితో కలిపి అప్పన్నను సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.. కాగా.. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.

వాస్తవానికి మే నెల 15 నాటికి దర్యాప్తు ముగించి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాల్సి ఉంది.. దర్యాప్తు పూర్తి కాకపోవడంతో గడువును మరో రెండు నెలలు పొడగించారు. కల్తీ నెయ్యి సరఫరాలో ఉత్తరాఖండ్ బోలెబాబా డెయిరీ జీఎం హరిమోహన్ రానా కీలకపాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న హరి మోహన్‌ను మార్చి 20న సిట్ అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న.. అలాగే ఉద్యోగుల విచారణ కీలకంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..