Tirumala News: శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన అవకాశం.. వర్షాల కారణంగా దర్శనం చేసుకోలేని వారి కోసం..

Tirumala News: రాయలసీమలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతి, తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా...

Tirumala News: శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన అవకాశం.. వర్షాల కారణంగా దర్శనం చేసుకోలేని వారి కోసం..
Ttd
Follow us

|

Updated on: Nov 22, 2021 | 2:29 PM

Tirumala News: రాయలసీమలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతి, తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు తిరుపతి పట్టణంతో పాటు తిరుమల గిరులు అతాలకుతలమయ్యాయి. కొండ చరియలు విరిగి పడడం, నడక దారి మొత్తం రాళ్లతో నిండిపోయాయి. ఇక కొండ మీదున్న ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఈ భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొందరు టికెట్లు ఉన్నా దర్శనం చేసుకోలేని పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న టీటీడీ శుభవార్తను తెలిపింది. వర్షాల కారణంగా తిరుమలకు రాలేని భక్తుల ప్రత్యేక సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు టికెట్లు కలిగిన భక్తులు దర్శన తేదీ మార్చుకునే వెసులు బాటు కల్పించారు. ఇందుకోసం భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన తేదీ మార్చుకోవచ్చు. దర్శన టికెట్లు నంబరు నమోదు చేసి నూతన టికెట్లును పొందే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఆరు నెలల లోపు ఏప్పుడైనా దర్శనం టికెట్ల నంబరుతో కొత్త టికెట్టు పొందే వీలును కల్పించారు.

ఈ విషయమై టీటీడీ అడిషనల్‌ ఈఓ ధర్మా రెడ్డి మాట్లాడుతూ.. భక్తులు తిరుమలకు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. రెండు ఘాట్ రోడ్లలో వాహనాలను అనుమతిస్తున్నామని, ఘాట్ రోడ్డు పాడైన ప్రాంతాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇక శ్రీవారి మెట్ల మార్గంలోని నాలుగు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, అలిపిరి నడక మార్గంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

Also Read: IND vs NZ: ఈ ఫొటోలో రోహిత్‌ పక్కన ఉన్నది ఎవరో తెలుసా.. 15 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టీమిండియా బౌలర్?

మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇలా ప్లాన్ చేయండి.. PPF, SSYలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నో లాభాలు.. ఇవి ఎలానో తెలుసా..

Egg Soup: ఎగ్ సూప్‌తో జలుబు, ఆ సమస్యలకు చెక్.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?