Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Soup: ఎగ్ సూప్‌తో జలుబు, ఆ సమస్యలకు చెక్.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?

Egg Soup Recipe in Winter: గుడ్డు ఆరోగ్యానికి వెరిగుడ్డు అని.. వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేందుకు.. ఎన్నో పోషకాలున్న గుడ్డును ప్రతిరోజూ

Egg Soup: ఎగ్ సూప్‌తో జలుబు, ఆ సమస్యలకు చెక్.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?
Egg Soup
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 22, 2021 | 12:31 PM

Egg Soup Recipe in Winter: గుడ్డు ఆరోగ్యానికి వెరిగుడ్డు అని.. వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేందుకు.. ఎన్నో పోషకాలున్న గుడ్డును ప్రతిరోజూ తినాలని సూచిస్తుంటారు. దీనిలో భాగంగా చాలామంది ఉదయం అల్పాహారంలో గుడ్డు తింటుంటుంటారు. ఎందుకంటే ఇందులో ప్రొటీన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి.. జిమ్‌కి వెళ్లేవారికి ఎగ్ డైట్ ఎంతో మేలు చేస్తుంది. అయితే.. ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైంది. వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో చాలామంది శరీరాన్ని వేడిగా ఉంచడం కోసం.. పలు ప్రత్యేక పదార్థాలను చేసుకొని ఇష్టంగా తింటుంటారు. చల్లటి వాతావరణంలో చాలామంది పలు పదార్థాలతో వేడి సూప్‌ను తయారుచేసుకొని తాగుతుంటారు. అలాంటి సూప్‌లల్లో ఎగ్ సూప్ ఒకటి. ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఎగ్ సూప్ ప్రయత్నించవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఎగ్ సూప్ రెసిపీ కోసం కావాలసిన పదార్థాలు, తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎగ్ సూప్ తయారు చేసేందుకు కావలసిన పదర్థాలు.. * 3 గుడ్లు.. పగులగొట్టి ఓ గిన్నెలో కలపాలి * 4 కప్పులు – చికెన్ స్టాక్ సూప్ * మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్ * అల్లం – 1/2 టీస్పూన్ (తురిమినవి) * సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్ * పచ్చి ఉల్లిపాయలు – 3 (తరిగినవి) * వైట్ పెప్పర్ – 1/4 స్పూన్ * పుట్టగొడుగులు – 3/4 కప్పు

తయారు చేసే విధానం.. ➼ ముందుగా కొంచెం చికెన్ స్టాక్‌ను గిన్నెలో వేసి మరగించాలి. ➼ తర్వాత అందులో కార్న్ స్టార్చ్ వేసి కలపాలి. ➼ కాసేపటి తర్వాత మిగిలిన చికెన్ స్టాక్, అల్లం, సోయాసాస్, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, మిరపకాయలు వేసి బాగా మరిగించాలి. ➼ తర్వాత మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడకబెట్టాలి. ➼ గ్యాస్‌ను మంట తక్కువ చేసి మరిగించాలి. ➼ ఆ తర్వాత గుడ్ల మిశ్రమాన్ని వేసి నిరంతరం కదిలిస్తూ ఉడకబెట్టాలి. ➼ ఆ తర్వాత కొంచెం మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనాను వేస్తే సరిపోతుంది. ➼ అనంతరం రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచితే.. హాట్ హాట్ ఎగ్ సూప్ రెడీ అవుతుంది.

ఆ తర్వాత.. ఎగ్ సూప్‌ను సర్వింగ్ బౌల్‌లో వేసి.. ఎగ్ సూప్‌లో కొంచెం పచ్చి ఉల్లిపాయలను యాడ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఇలా ఎగ్ సూప్‌ను చేసుకోని తింటే.. శరీరాన్ని వేడిగా ఉంచుకోవడంతోపాటు.. పోషకాలు కూడా అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: