Roselle Fruit Water: గోంగూర ఆకులు, పువ్వులు, కాండము, కాయలు అనిటితో లాభాలే.. మరీ ఇన్ని లాభాలు.. (వీడియో)

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Nov 22, 2021 | 8:51 AM

ప్రకృతి అందించిన దివ్య వరం ఆకుకూరలు. అలాంటి ఆకుకూరల్లో ఒకటి గోంగూర. పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ దేశవాళీ గోంగూర కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవు లోని రక్షణ పత్రములు...


ప్రకృతి అందించిన దివ్య వరం ఆకుకూరలు. అలాంటి ఆకుకూరల్లో ఒకటి గోంగూర. పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ దేశవాళీ గోంగూర కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవు లోని రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ గొంగూర అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు.. బోలెడన్ని పోషకాలున్నాయి. అయితే గోంగూరతో కంటే ఎక్కువ ప్రయోజనాలను గోంగూర కాయలు, పువ్వుల్లో ఉన్నాయట. వీటిని ఔషధ విలువ కోసం సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు.

ముఖ్యంగా గోంగూర కాయలు అధిక రక్తపోటు, గాయాలు, పూతల , జలుబుల నివారణకు సహాయపడుతుందని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో కండ్లకలక చికిత్సకు ఉపయోగిస్తారు. గోంగూర కాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. షుగర్ పేషేంట్స్ కు గోంగూర పువ్వులు ఓ దివ్య వరం. షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడానికి గ్లాస్ వాటర్‌లో మూడు లేదా నాలుగు గోంగూర పువ్వులు వేసుకుని బాగా మరిగించి.. పరగడుపున తీసుకోవాలి. అంతేకాదు గోంగూర పువ్వు తో చేసిన నీటిని రోజు పరగడుపున తాగితే అధిక బరువు సమస్య దూరం అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బల పడి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.

గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి.. దానిని వడకట్టి.. అరకప్పు రసంలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగితే రేచీకటి తగ్గుతుంది. గోంగూర పువ్వులు వేసి మరిగించిన నీటిని సేవించటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి. కిడ్నీలు శుభ్ర పడతాయి. మెదడు పని తీరు మెరుగు పడుతుంది. జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu