Andhra Weather: ఏపీలో పిడుగులతో వానలు.. హెచ్చరిక చేసిన వాతావరణ శాఖ
ఏపిలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలానే కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. గురువారం, శుక్రవారం 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మే 1, గురువారం: • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. • కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 2, శుక్రవారం: • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 3, శనివారం: • రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 4, ఆదివారం: • రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 66మిమీ, ఎస్.రాయవరంలో 59మిమీ, అచ్యుతాపురంలో 55మిమీ, సాలపువానిపాలెం 51మిమీ, కొప్పాక 47మిమీ, ప్రకాశం జిల్లా అనుమలవీడు 44మిమీ చొప్పున, 24 ప్రాంతాల్ల్ 30మిమీ కు పైగా వర్షపాతం నమోదైందన్నారు.
బుధవారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 42.7°C, వైఎస్సార్ జిల్లా అట్లూరు, కర్నూలులో 41.8°C, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా తవణంపల్లె 41.7°C, అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 41.5°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.




