Srisailam: శ్రీశైలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష బీభత్సం.. అంధకారంలో నగరవాసులు!
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, పిడుగుపాటులో నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆలయ ఆవరణలో మినహా శ్రీశైలం మొత్తం చీకటిమయం అయింది. దీంతో కరెంట్ లేక స్థానికులు, శ్రీశైలానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇంబ్బందులు ఎదర్కొంటున్నారు.

నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పాటు, పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగు పాటుతో స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్థంభాలు నేల కూలినట్టు తెలుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలిగింది. శ్రీశైలం ఆలయం మినహా నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీంతో నగరం మొత్తం చీకటిమయం అయిపోయింది. కరెంట్ లేకపోవడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కాస్త తగ్గడంతో స్థానిక విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యరారు. వెంటనే నగరంలో విద్యుత్ పునరుద్దరణ చర్యలు చేపట్టారు. వర్షానికి నేల కూలిన చెల్లను తొలగిస్తున్నారు. విరిగి పడిన స్థంభాలను సరిచేసి విద్యుత్ వ్యవస్థను పునరుద్దరిస్తున్నారు.
వీడియో చూడండి..
శ్రీశైలం, సున్నిపెంట సహా పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా శ్రీశైలంలో పలు కాలనీలు, ప్రధాన రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో ఎత్తైన ప్రాంతాల నుంచి వర్షపు నీరు దిగువకు కొట్టురావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా నరగంలోని ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. త్వరగా విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించాలని స్థానికులు, శ్రీశైలానికి వచ్చిన భక్తులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




