AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ 3 నగరాల్లో దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రుల ఏర్పాటు..

ఏపీలో అత్యుత్తమ కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ హాస్పిటల్స్‌ రాబోతున్నాయ్‌. కేన్సర్‌తో ఏ ఒక్కరూ మరణించకూడదన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తోంది జగన్‌ సర్కార్‌.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ 3 నగరాల్లో దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రుల ఏర్పాటు..
AP Cm Ys Jagan Mohan Reddy
Shiva Prajapati
|

Updated on: Dec 24, 2022 | 5:59 AM

Share

ఏపీలో అత్యుత్తమ కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ హాస్పిటల్స్‌ రాబోతున్నాయ్‌. కేన్సర్‌తో ఏ ఒక్కరూ మరణించకూడదన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తోంది జగన్‌ సర్కార్‌. ఇంతకీ, ఈ హాస్పిటల్స్‌ ఎక్కడెక్కడ రాబోతున్నాయ్‌?. ఎప్పట్నుంచి అందుబాటులోకి రానున్నాయ్‌? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. దేశంలోనే అత్యుత్తమ కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ హాస్పిటల్స్‌ ఏర్పాటుకు రంగంసిద్ధమైంది. సీఎం జగన్‌ ఆదేశాలతో ఏపీలో మూడు కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్స్‌ నిర్మాణం కాబోతున్నాయ్‌. మూడింటిలో ఒకటి తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

దేశంలోనే అత్యుత్తమ చికిత్సలు అందించేలా లేటెస్ట్‌ టెక్నాలజీతో ఈ హాస్పిటల్‌ ఏర్పాటు కాబోతోంది. తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయుడు పర్యవేక్షణలో ఈ హాస్పిటల్‌ రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌కల్లా కేన్సర్‌ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో, స్విమ్స్‌కి అనుబంధంగా కేన్సర్‌ ఆస్పత్రి ఆపరేషన్స్‌ జరుగుతాయన్నారు వైవీ సుబ్బారెడ్డి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే దసరా రోజు సీఎం జగన్‌ చేత ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..