5

AP Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..

నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం..

AP Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
Weather Alert
Follow us

|

Updated on: Dec 24, 2022 | 6:23 AM

నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారిందని, ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యాన 420 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడులోని నాగపట్నం దక్షిణ ఆగ్నేయానికి 600 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు అధికారులు. కాగా, వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది.

మొన్నటి మొన్న మాండూస్ తుపాన్ ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. తుపాను ప్రభావంతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉండటంతోప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

స్కిన్ టాన్‌ను తొలగించాలా.. బెండకాయ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి
స్కిన్ టాన్‌ను తొలగించాలా.. బెండకాయ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి
పసుపు బోర్డు కోసం.. పుష్కర కాలంగా చెప్పులు లేకుండా దీక్ష..
పసుపు బోర్డు కోసం.. పుష్కర కాలంగా చెప్పులు లేకుండా దీక్ష..
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. శివాజీ శాడిజం పీక్స్‌కు ..
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. శివాజీ శాడిజం పీక్స్‌కు ..
చీటీలో రాజ్ రాసిన విషయం కావ్యకు తెలుస్తుందా? కావ్య రియాక్షన్ ఏంటి
చీటీలో రాజ్ రాసిన విషయం కావ్యకు తెలుస్తుందా? కావ్య రియాక్షన్ ఏంటి
మీ పిల్లలకు చదువే కీలకం కాదు.. అంతకుమించి ఇది ముఖ్యం..
మీ పిల్లలకు చదువే కీలకం కాదు.. అంతకుమించి ఇది ముఖ్యం..
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!
గిల్, రైనా రికార్డులను బ్రేక్ చేసి అగ్రస్థానానికి చేరిన యశస్వీ..
గిల్, రైనా రికార్డులను బ్రేక్ చేసి అగ్రస్థానానికి చేరిన యశస్వీ..
టాలీవుడ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న రవీనా టాండన్ కూతురు
టాలీవుడ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న రవీనా టాండన్ కూతురు
తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..
తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..