IPL 2023 Auction: ఐపీఎల్‌లో జాక్‌పాట్ కొట్టేసిన గుంటూరు కుర్రాడు.. ధోని జట్టులో ఛాన్స్.. ఇంట్లో సంబరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. కొచ్చి వేదికగా శుక్రవారం (డిసెంబర్ 23) జరిగిన ఐపీఎల్2023 మినీ వేలంలో రషీద్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
ప్రపంచంలోనే క్యాష్ రిచ్ క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందింది ఐపీఎల్. ఈ టోర్నీ ద్వారా ఎంతోమంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. కొచ్చి వేదికగా శుక్రవారం (డిసెంబర్ 23) జరిగిన ఐపీఎల్2023 మినీ వేలంలో రషీద్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. తద్వారా గుంటూరు జిల్లా నుంచి ఈ లీగ్‌కు ఎంపికైన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లోషేక్ రషీద్ భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ముఖ్యంగా సెమీఫైనల్ తో పాటు ఫైనల్లో కీలక ఇన్నింగ్సులు ఆడి టీ20 ప్రపంచకప్ లో టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టడంలో కీ రోల్ పోషించాడు. ఇక ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2022లోనూ అదరగొట్టేశాడు. రాయలసీమ కింగ్స్ తరఫున ఆడి159 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు.
ధోనితో కలిసి..
గుంటూరు జిల్లాలోని ఒక మధ్య తరగతి కుటంబంలో జన్మించాడు షేక్ రషీద్. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తొమ్మిదేళ్లకే అండర్-14 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆతర్వాత అండర్ -19లోనూ సత్తాచాటాడు. ఇక ఐపీఎల్‌లో ఆడాలన్న రషీద్ కల మినీవేలంతో సాకారమైంది. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టుతోనే జత కట్టనున్నాడు. తద్వారా ఎంస్ ధోని వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూంను పంచుకోనున్నాడు. కాగా ఐపీఎల్‌కు షేక్ రషీద్ ఎంపికకావడంపై గుంటూరులోని అతని ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా గుంటూరు కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపికయ్యారని తెలిసి సామాజిక మాధ్యమాల్లో అతనికి శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Super Times await you, Rasheed! Anbuden Welcome!?#SuperAuction #WhistlePodu ?? pic.twitter.com/1gCKiChULP
— Chennai Super Kings (@ChennaiIPL) December 23, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..